Narayanpet : రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు..!
ఇతర రాష్ట్రాలకు తరలింపు ను నిరోధించేందుకు నారాయణపేట జిల్లా పరిధిలోనీ రాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం 6 బోర్డర్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.

Narayanpet : రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
యాసంగి (రబీ) సీజన్‌లో వరి కొనుగోళ్ల సందర్భంగా పొరుగు రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రానికి వరి ధాన్యం అక్రమంగా రాకుండా, అలాగే రాష్ట్రంలోని పీడీఎస్,సి ఎం ఆర్ బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలింపు ను నిరోధించేందుకు నారాయణపేట జిల్లా పరిధిలోనీ రాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం 6 బోర్డర్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.
చెక్ పోస్టులు
నారాయణపేట మండలం జలాల్పూర్, దామరిగిద్ద మండలం కాన్కుర్తి,
కృష్ణ మండలం చేగుంట, కృష్ణ బ్రిడ్జి, ఉట్కూర్ మండలం సమిస్తాపూర్,
మాగనూర్ మండలం ఉజ్జెల్లి చెక్‌పోస్ట్ లు ఏర్పాటు చేసినట్లు ఎస్పీతెలిపారు.
ఈ చెక్‌పోస్టుల వద్ద పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేయబడుతుందని ఎస్పీ తెలిపారు.
ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుండి వరి ధాన్యం అక్రమంగా రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చెక్‌పోస్టుల ద్వారా వెళ్లే ప్రతి వాహనానికి సంబంధించిన వేబిల్, ఇతర రవాణా పత్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, అనుమతులు లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే ప్రతి వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవర్ వివరాలు, గమ్యస్థానం వంటి సమాచారాన్ని రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. వరి వ్యాపారంలో పాల్గొనే వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద మాత్రమే కాకుండా, బోర్డర్ గ్రామాల ద్వారా అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక పహారా ఏర్పాటు చేయాలని సూచించారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సై లు చెక్‌పోస్టుల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని, విధుల్లో ఉన్న పోలీస్ ,రెవెన్యూ సిబ్బందిని తరచూ తనిఖీ చేస్తూ అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ప్రజలు కూడా సహకరించి, అనుమానాస్పద వాహనాలు లేదా అక్రమ వరి రవాణా గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.









