మిర్యాలగూడ : SBI శాఖ తరలింపు.. ఆందోళనలో రైతులు..!
మిర్యాలగూడ : SBI శాఖ తరలింపు.. ఆందోళనలో రైతులు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ మండలంలోని అవంతిపురం వ్యవసాయ మార్కెట్లో 12 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఎస్బిఐ శాఖను మిర్యాలగూడ కు తరలిస్తున్నారు. మార్కెట్ యార్డులో ఆ శాఖ నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నందున మిర్యాలగూడకు తరలిస్తున్నారు.
కానీ సమీప గ్రామాల రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. మార్కెట్ యార్డులో కాకుండా అలగడప లో గాని అవంతిపురంలో ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ అవంతిపురం
తరలించాక రైతుల వ్యాపారస్తుల ప్రయోజనం కోసం SBI వాళ్ళు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో 12 ఏండ్ల క్రితం శాఖను ఏర్పాటు చేసింది.
చుట్టుపక్కల వున్న బాధలాపురం, అవంతిపురం యాదగిరిపల్లె, ఉట్లపల్లి, కాల్వ పల్లి యర్రావులపాడు, తండా, సుబ్బారెడ్డిగూడెం, ఆలగడప ముకుందపురo, కల్లూరు, పెంచికాలదిన్నే, సోమారం, బూరుగుపూడి తండా, చింత కుంట, బోదేలదిన్నె, చిల్లేపల్లి, ములకలకాలువ, రాయినిపాలెం, జాలుబావి తండా గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుంది.
రైతులకు రుణాలు ఇవ్వడం, బంగారం కుదువ బెట్టుకుని ఋణం ఇవ్వడం లాంటిది, బాగా పనిచేస్తుంది. అయితే గత సంవత్సరం నుంచి బ్యాంక్ సక్రమంగా పనిచేయడం లేదు. రైతులు వినియోగదారులు చాలా అవస్థలు పడుతున్నారు.
ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఎలుకలు వైర్లు కొరకడం వలన సిస్టమ్ దెబ్బతిన్నదని సంవత్సరం నుంచి బ్యాక్ సిబ్బంది కూడా నానా అవస్థలు పడుతున్నారు.
మార్కెట్ శాఖ, SBI రిజనల్ శాఖ వెంటనే పూనుకుని మరమ్మతులు చేయించి వినియోగదారుల కష్టాలు తీర్చి యధావిధిగా కొనసాగించాలని కోరుతున్నారు.
మార్కెట్ నుంచి SBI శాఖను మిర్యాలగూడ తరలించడం తగదు. ఆలగడప లో గాని అవంతిపురంలో గాని ఏర్పాటు చేయాలని అధికారులు స్పందలసిందిగా రైతులు వేనేపల్లి పాండురంగారావు, తుమ్మల సత్యనారాయణ చౌదరి, ఇంద్రపల్లి బుచ్చిబాబు, గోవిందరెడ్డి, రంజాన్, సైదులు నర్సయ్య, సునిల్ కోరుతున్నారు.
ALSO READ :
Good News : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. సేల్స్ ఎంపోరియం ఏర్పాటు..!
Govt Land : దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా..!
Independence day : జెండా పండుగ ఎక్కడ.. సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేసేది అక్కడేనా..!
Miryalaguda : చింతపల్లి రోడ్ లో చిమ్మ చీకట్లు.. భయాందోళనలో ప్రజలు..!









