ACB : మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటి పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు..!

ACB : మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటి పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ACB అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో హైదరాబాదులోని సబ్ రిజిస్టర్ బలరాం యాదవ్ ఇంటితో పాటు కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ నల్లగొండ డిఎస్పి జగదీష్ చంద్ర, సిఐలు వెంకట్రావు. వికాస్, సిబ్బంది ఆధ్వర్యంలో
విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ అవినీతి నిరోధక శాఖ డిజిపి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా మిర్యాలగూడ సబ్ రిజిస్టర్ కార్యాలయం పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో తనిఖీలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
అనధికారికంగా ఓ మహిళ ఉద్యోగితో పనులు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆమెను లంచాలు తీసుకునేందుకు ఏర్పాటు చేసినట్లుగా అనుమానిస్తున్నామన్నారు. ఆమె వద్ద 63,160 రూపాయల నగదు దొరికినట్లు చెప్పారు. ఆ సొమ్ముకు సంబంధించిన వివరాలు ఇవి లేకపోవడంతో అవినీతి సొమ్ముగా గుర్తించినట్లు తెలిపారు.
కార్యాలయంలో నాలుగు సీసీ కెమెరాలు ఉండగా కేవలం ప్రజలు కూర్చునే వైపు ఒక కెమెరా మాత్రమే పనిచేస్తుందని, ఉద్యోగుల వైపు ఉన్న మూడు కెమెరాలు పనిచేయడం లేదని గుర్తించినట్లు తెలిపారు. తమ అక్రమ తంతు బయటపడకుండా పథకం ప్రకారమే సీసీ కెమెరాలు పనిచేయకుండా నిలిపివేసినట్లుగా వెళ్లడైనట్లు తెలిపారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ 19 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సదరు వ్యక్తులకు ఇవ్వకుండా కార్యాలయంలోనే తన వద్ద సబ్ రిజిస్టర్ పెట్టుకున్నట్లు బయటపడిందన్నారు. దీనిపై ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడంటూ తెలిపారు. శుక్రవారం 3 గంటల నుంచి తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయని, గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి అందిస్తామని అన్నారు.
MOST READ :
-
Miryalaguda : జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం.. మిర్యాలగూడలో సంబరాలు..!
-
Miryalaguda : అభ్యాస్ ప్రైమరీ స్కూల్ లో ఆకట్టుకున్న జాతీయ నాయకుల వేషధారణలు..!
-
District collector : జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశం.. నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి..!
-
Suryapet : మీ మొబైల్ ఫోన్ పోయిందా.. CEIR పోర్టల్ లో నమోదు చేస్తే చాలు దొరికినట్టే..!










