Miryalaguda : అధికారుల ఆకస్మిక తనిఖీలు.. మద్రాస్ ఫిల్టర్ కాఫీ సీజ్.. పలు హోటళ్లకు భారీ జరిమానా..!

Miryalaguda : అధికారుల ఆకస్మిక తనిఖీలు.. మద్రాస్ ఫిల్టర్ కాఫీ సీజ్.. పలు హోటళ్లకు భారీ జరిమానా..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ అధికారులు పట్టణంలోని పలు హోటళ్లలో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు హోటళ్లను సీజ్ చేయటంతో పాటు భారీ జరిమాణాలు విధించారు. అధికారుల పరిశీలనలో హోటళ్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యత, వంటశాల పరిస్థితులు, ప్రాంగణాల శుభ్రతను తనిఖీ చేశారు.
కొన్ని హోటళ్లు ట్రేడ్ లైసెన్స్ లేకుండా చాలామణి అవుండటంతో పాటు కొన్ని హోటళ్లకు ఆస్తి పన్ను లేకుండా ఉన్నాయని అధికారులు గుర్తించారు. అదేవిధంగా కొన్ని వాటికీ ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయని, రెసిడెన్షియల్ ప్రాపర్టీలను వాణిజ్య ప్రయోజనాలకు అనుకూలంగా అనుమతి లేకుండా వినియోగిస్తున్నారనే అధికారులు గమనించారు.
కొన్ని హోటళ్లలో అపరిశుభ్రతా వాతావరణంలో ఆహారం తయారు చేసి అందిస్తున్నారని, ఆహార తయారీకి వినియోగించే ఆహార పదార్దాలు నాణ్యత లోపించిన విషయాన్ని గమనించారు.
నిబంధనల ఉల్లంఘనల కారణంగా మున్సిపల్ అనుమతులు లేకుండా నడుస్తున్న మరియు ఆపరిశుభ్రతా ఆహారం సరఫరా చేస్తున్న కొన్ని హోటళ్లు సీజ్ చేయబడ్డాయి. అలాగే బకాయిలు ఉన్నవి మరియు లైసెన్స్ లేకుండా వ్యాపారం సాగిస్తున్న, పరిశుభ్రత పాటించని కొన్ని హోటళ్లపై జరిమానాలు విధించబడ్డాయి.
అధికారులు చర్యలు తీసుకున్న వివరాలు
1. మద్రాస్ ఫిల్టర్ కేఫ్ – సీజ్
2. చిల్ కేఫ్ రెస్టారెంట్ – షో కాస్ నోటిస్ ఇవ్వడం జరిగింది.
3. టీ వనం కేఫ్- షో కాస్ నోటీసివ్వడం జరిగింది.
4. శ్రీ కృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్- 50,000/- జరిమానా
5. SSS రెస్టారెంట్ -20,000/- జరిమానా
6. ఖలీల్ డాబా హ 30,000/- జరిమానా.
7. కృష్ణ పట్నం రెస్టారెంట్ 30,000/-
8. సాయిరాం మోటార్స్ /- అనుమతి లేకుండా నిర్మాణం జరుగుతుంది హెచ్చరించడం జరిగింది.మరియు తాళం వేయడం జరిగింది.
9. విట్రోస్ సినిమా థియేటర్ ఇన్స్పెక్షన్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని హెచ్చరించడం జరిగింది.
10. ధావత్ బిర్యానీ హబ్ హ 25,000/- జరిమానా.
హోటల్ యాజమాన్యాలను తక్షణమే చెల్లించవలసిన పన్నులు చెల్లించాలని, సరైన లైసెన్సులు పొందాలని మరియు పరిశుభ్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశించారు. స్వచ్ఛమైన ఆహారము మిర్యాలగూడ పట్టణ ప్రజలకు అందించే ఉద్దేశంతో మున్సిపాలిటీ కఠిన చర్యలు కొనసాగిస్తుందని హెచ్చరించారు.
హోటల్ యజమానులు మరియు పట్టణ ప్రజలు ఇట్టి విషయమై మున్సిపాలిటీ తో సహకరించాలని కోరారు. కార్యక్రమము లో శానిటరీ ఇన్స్పెక్టర్ల, వెంకట రమణ, రవి తేజ, మున్సిపల్ మేనేజర్ జ్ఞానేశ్వరీ, టౌన్ ప్లానింగ్ అధికారులు అంజయ్య, చరణ్ తేజ, శంకర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. దీర్ఘకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి శ్రీకారం..!
-
Red Rice : రెడ్ రైస్ తింటే ఆరోగ్యమేనా.. చాలా మంది ఇష్టపడుతున్నది అందుకేనా.. తెలుసుకుందాం..!
-
Bumper Offers : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. క్రోమాలో అద్భుతమైన ఆఫర్లు..!
-
Clear Tax : ఏఐ ద్వారా 50 వేలమందికి పైగా ప్రాంతీయ భాషల్లో పన్నుల దాఖలు..!
-
Miryalaguda : విందు కంటె రైతులే ముద్దు.. సీఎం రేవంత్ రెడ్డికి రూ.2 కోట్లు అందజేసిన ఎమ్మెల్యే బీఎల్ఆర్..!










