సూది వేసి హత్య కేసులో వీడిన మిస్టరీ

సూది వేసి హత్య కేసులో వీడిన మిస్టరీ

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు..

అక్రమ సంబంధంమే హత్యకు కారణం

ఖమ్మం (ముదిగొండ) సెప్టెంబర్ 20 మన సాక్షి ప్రతినిధి

మండలంలో వల్లభి గ్రామం వద్ద సూది మంది ఇచ్చి షేక్ జమాల్ ను హత్య చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను అనుమానితులుగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. చింతకాని మండలం నామవరం వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్న సందర్భంలో అనుమానిత వ్యక్తి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. నామవరంకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని కారణంతో పథకం ప్రకారం హత్య చేసినట్లు సమాచారం. వారిలో నర్సింశెట్టి వెంకటేశ్వర్లు, గోదా మోహన్ రావు మత్కేపల్లి నామవరం గ్రామస్తులుగా గుర్తించారు.

హత్య జరిగిన సమయంలో ఎటువంటి ఆధారాలు లభించపోవటంతో పాటు సీసీ కెమెరాలు కూడా నిందితులు కనిపించకపోవడంతో పోలీసులకు పలు అనుమానాలకు నేపథ్యంలో మృతుని భార్య చరవాణి ఆధారంగా విచారించగా అసలు విషయం బయటపడ్డదని సమాచారం.హత్యకు ముందు నిందితులతోనే ఎక్కువసేపు మాట్లాడినట్టు గుర్తించారు. సూది మంది హత్య కేసు రాష్ట్రంలో సంచలనం కావడంతో పోలీసులు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రెండు రోజుల్లోనే కేసులో పురోగతి సాధించారు. నిందితుల్ని పట్టుకోవడం కోసం నాలుగు బంధాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఖమ్మం రూరల్ ఏసిపి బస్వా రెడ్డి సారధ్యంలో పోలీసులు కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.