Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Breaking : సూర్యాపేటలో విషాదం.. ధాన్యం లోడు ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి..!
సూర్యాపేట మండల పరిధిలోని కాసరాబాద్ రోడ్డులో కుసుమ వారి గూడెం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Breaking : సూర్యాపేటలో విషాదం.. ధాన్యం లోడు ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి..!
సూర్యాపేట రూరల్, మనసాక్షి :
సూర్యాపేట మండల పరిధిలోని కాసరాబాద్ రోడ్డులో కుసుమ వారి గూడెం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వడ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ స్కూటీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, కాసరాబాద్ గ్రామానికి చెందిన కొల్లు సందీప్ (28) ఈ ప్రమాదంలో మృతి చెందాడు.
సందీప్ వృత్తిరీత్యా ఎలక్ట్రిషన్‌గా పని చేస్తూ, పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు సందీప్‌కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. అతని మృతి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది.









