Breaking Newsక్రైంజిల్లా వార్తలుయాదాద్రి భువనగిరి జిల్లా
Yadadri bhuvanagi : కారు ఢీకొని వ్యక్తి మృతి..!
కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ శివారులో చోటుచేసుకుంది.

Yadadri bhuvanagi : కారు ఢీకొని వ్యక్తి మృతి..!
తుర్కపల్లి, మన సాక్షి :
కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నాగారం కు చెందిన చీరాల పవన్ కుమార్ (39) తోపాటు తిలక్ కుమార్ లు జగదపుర్ కు వెళ్తున్న సమయంలో వాసాలమర్రి గ్రామ శివారు ప్రాంతంలో కారు ఆపి దిగుతున్న సమయంలో వెనక నుండి భువనగిరి నుండి జగదపుర్ కు వెళ్తున్న కొంపల్లి గణేష్ కారు ఢీకొట్టింది. తిలక్ కుమార్ కు తీవ్ర గాయాలు కాగా, పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ కి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తక్యుద్దీన్ తెలిపారు.









