తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ కీలక ప్రకటన.. మిర్యాలగూడలో ఇకపై వారంలో రెండు రోజులు ప్రజా వాణి..!

Miryalaguda : ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ కీలక ప్రకటన.. మిర్యాలగూడలో ఇకపై వారంలో రెండు రోజులు ప్రజా వాణి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతి బుధవారం, శనివారం ప్రజా సమస్యల ఫిర్యాదుల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్టు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తెలియజేశారు.

బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఎస్పీ రాజశేఖర్ రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తో కలిసి శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ

ప్రజావాణిలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని అన్నారు.నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యచరణ ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాధులు సోకకుండా పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు.
వారానికి 5 వార్డుల చొప్పున డ్రైనేజీ పూడిక తీత పనులు నిర్వహిస్తామన్నారు.

విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా వసతిగృహాలు, గురుకులాలు, పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామాల నుండి పట్టణానికి వచ్చే వారికోసం మౌలిక వసతుల కల్పన చేయనున్నట్టు తెలియజేశారు.

ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రాజీవ్ చౌక్ నుండి ఈదులగూడ వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నందిపాడు, చింతపల్లి ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు కొద్దిరోజులలోనే ప్రారంభం అవుతున్నాయని, కొన్ని టెక్నికల్ సమస్యల మూలాన పనులు ఆలస్యం అయ్యాయని తెలియజేశారు.

నియోజకవర్గంలో గంజాయి నివారణ కోసం పోలీసుల ప్రత్యేక చెకింగ్ పరికరాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. అర్ధరాత్రి 11 తర్వాత రోడ్లపైకి వచ్చేవారు. గుర్తింపు పత్రాలు కలిగి ఉండాలని లేనిచో పోలీస్ వారు తగిన చర్యలు తీసుకుంటారని అన్నారు. పట్టణంలో శాంతి భద్రత కోసం పలు చోట్ల నూతనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

నియోజకవర్గంలో , గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలలో తల దూర్చుతూ రౌడీయిజం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. భూభారతిలో అన్ని భూ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.

కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసాం. ఇంకా అర్హులను గుర్తించి పంపిణీ చేస్తాము , రేషన్ కార్డులు పెరిగినందున బియ్యం తీసుకునేందుకు ఇబ్బందులు లేకుండా మరి కొన్ని కొత్త రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, సలహాలు సూచనలు తెలియజేయండి. మన ఉరి అభివృద్ధి కోసం మనం అందరం కలిసి పనిచేయాలని కోరారు.

MOST READ : 

  1. Mother : విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సంపాదించారు.. తల్లిని మాత్రం ఇంట్లో నుంచి గెంటివేశారు..!

  2. Diabetes : పరీక్షలు లేకుండానే మీ శరీరంలో షుగర్ తెలుసుకోవచ్చు..!

  3. Miryalaguda : సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా వెంకటేశ్వర్లు..!

  4. PMSBY : రూ.20 చెల్లిస్తే ఏడాదికి రెండు లక్షల ప్రధానమంత్రి సురక్ష ప్రమాద బీమా.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..!

  5. Mens: పురుషులు చెవులు కుట్టించుకుంటే లాభమా, నష్టమా..!

మరిన్ని వార్తలు