Model school : మోడల్ స్కూల్ విద్యార్థులకు అమెరికా వెళ్లే అవకాశం.. ఎయిర్ పోర్టు కి వెళ్ళాక ఏం జరిగిందో ఏమో..?

Model school : మోడల్ స్కూల్ విద్యార్థులకు అమెరికా వెళ్లే అవకాశం.. ఎయిర్ పోర్టు కి వెళ్ళాక ఏం జరిగిందో ఏమో..?

మహేశ్వరం, మన సాక్షి

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం.  మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మోడల్ స్కూల్ 11 మంది విద్యార్థులకు అమెరికా నాసాలో సెమినార్ లో పాల్గొని అవకాశం వచ్చింది. ఆ మోడల్ స్కూల్ విద్యార్థులు ఎవరికి రాని అవకాశం రావడంతో ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. తల్లిదండ్రుల్లో కూడా పట్టరాని ఆనందం కలిగింది. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యాయి.

 

అమెరికా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని మంగళవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత అమెరికా ప్రయాణం రద్దయిందని అధికారులు ఫోన్ చేసి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ధనంజయకు తెలిపారు.

 

ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థులు అమెరికా నాసా వెళుతున్నారంటే చాలా గొప్ప విషయం. కానీ ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్ విద్యా సంస్థలు కుమ్మక్కై మోడల్ స్కూల్ విద్యార్థులు అమెరికా వెళ్లకుండా అడ్డుకున్నారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మోడల్ స్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

 

అమెరికా వెళితే హైదరాబాదులో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలు పరిస్థితి ఏంటి..?ఆని ఆలోచనలో పడ్డారు. పూర్తిగా ప్రభుత్వ విద్యా సంస్థలకు పేరు వస్తుందని కార్పొరేట్ విద్యా సంస్థలు దివాలా తీస్తాయని,

 

ఏ ప్రభుత్వ అధికారుల పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుకోరు కార్పొరేట్ విద్యాసంస్థలను చదువుతారు. వారికి రాని అవకాశం ప్రభుత్వ విద్యాసంస్థల చదువుతున్న పేద విద్యార్థులకు రావడంతో  ప్రభుత్వ అధికారులు ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలతో కుమ్మక్కై పేద విద్యార్థుల ఆశలనుపై నీళ్లు చల్లారని పలువురు ఆరోపిస్తున్నారు.

 

మహేశ్వరం ప్రభుత్వ మోడల్ స్కూల్ నిరుపేద విద్యార్థులు అమెరికా వెళ్లే అవకాశాన్ని జారవిడుచుకున్న వైనం, విద్యా శాఖ మంత్రి, కేటీఆర్, కలెక్టర్ ఆశీస్సులు, ఆదరణ, ఆర్థిక సహాయం, ఉన్నప్పటికీ, కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాసి, ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలకు పేరు వస్తదో అని, కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల, ఈరోజు నిరుపేద విద్యార్థులు అమెరికా నాసా లాంటి అత్యున్నత సెమినార్లో పాల్గొనే అవకాశం వచ్చినా, ఎయిర్ పోర్ట్ దాకా వెళ్లి, వెన్నుతిరిగిన వైనం.

 

ప్రభుత్వ పాఠశాలలో మార్పును నిశితంగా పరిశీలిస్తున్న కార్పోరేట్ సంస్థలు, అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అమెరికా వెళ్లకుండా అడ్డుకున్నయని స్థానికులు ఆరోపించారు. అసలు ఏం జరిగిందో పూర్తి విచారణ జరిపించి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక బిజెపి నాయకులు డిమాండ్ చేశారు.