Rythu Bharosa : రైతుల ఖాతాలలో డబ్బులు.. రైతు భరోసా ఈసారి వారికి కూడా.. లేటెస్ట్ అప్డేట్..!
Rythu Bharosa : రైతుల ఖాతాలలో డబ్బులు.. రైతు భరోసా ఈసారి వారికి కూడా.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా పథకం కు నిధులు విడుదల చేయడానికి వేగవంతంగా చర్యలు చేపడుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు పంట సహాయం అందింది. నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు రైతు భరోసా పంట సహాయం అందకపోవడంతో ఎదురుచూస్తున్నారు.
రైతు భరోసా పథకాన్ని 2025 జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. మార్చి 31వ తేదీలోగా రైతులందరికీ రైతు భరోసా పథకం ద్వారా పంటల పెట్టుబడి సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ కేవలం నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఒక విడత ఎకరానికి 6000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సహాయం రైతుల ఖాతాలలో జమ చేశారు. మిగతా రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. మే 25వ తేదీ తర్వాత నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి అన్ని స్థాయిలలో రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.
MOST READ :
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం..!
-
Army : విశ్రాంత సైనికులకు తోడుగా యాక్సిస్.. వారందరికీ పెన్షన్లు, సంక్షేమ పథకాలు..!
-
KTR : ప్రజల దృష్టిని మరల్చేందుకే నోటీసుల హైడ్రామా..!
-
UPSC : పట్టు వదలని విక్రమార్కుడు.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో మిర్యాలగూడ వాసి టాప్ ర్యాంకర్..!
-
Miryalaguda : మీ ప్రాంతంలో విద్యుత్ సమస్యలు వస్తే.. ఇవిగో కొత్త ఫోన్ నెంబర్లు..!
-
Gold Price : మరోసారి పడిపోయిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!
-
Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఒక్కరోజే రూ 24,000..!









