Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

BIG BREAKING : ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..!

BIG BREAKING : ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..!

తెలంగాణ బ్యూరో , మన సాక్షి:

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగింది. రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉన్నప్పటికీ కూడా ఉత్కంఠ పరిస్థితుల మధ్య రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 31 జిల్లాలలో 292 జెడ్పిటిసి, 2963 ఎంపీటీసీ లకు ఎన్నికలు జరగనున్నాయి.

ఒక వైపు బీసీ రిజర్వేషన్లపై న్యాయ పోరాటం కొనసాగుతుండగా మరోవైపు ఎన్నికల నిర్వహణ కొనసాగుతుంది. నేటి నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు మొదటి విడత నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అక్టోబర్ 23వ తేదీన ఎంపీటీసీ, జెడ్పిటిసి మొదటి విడత పోలింగ్ నిర్వహించనున్నారు.

రెండవ దశలో అక్టోబర్ 13వ తేదీ నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. అక్టోబర్ 29వ తేదీన రెండవ దశ పోలింగ్ జరగనున్నది. నవంబర్ 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నది.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఎన్నికల వ్యయ గరిష్ట పరిమితిపై వెల్లడి..!
  2. కోడిపందాలపై డ్రోన్ల సహాయంతో పోలీసుల దాడులు.. ఐదుగురు అరెస్ట్..!
  3. TG News : తెలంగాణలో మంత్రుల మద్య వివాదం ముగిసిందా.. పొన్నం ఏం చెప్పారు..!
  4. Nalgonda : అధిక వడ్డీ ఆశచూపి రూ.100 కోట్లు వసూలు.. అప్పు తీర్చకపోవడంతో వడ్డీ వ్యాపారి ఇంటికి నిప్పు పెట్టిన బాధితులు..!

మరిన్ని వార్తలు