Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

TG News : తెలంగాణలో మంత్రుల మద్య వివాదం ముగిసిందా.. పొన్నం ఏం చెప్పారు..!

TG News : తెలంగాణలో మంత్రుల మద్య వివాదం ముగిసిందా.. పొన్నం ఏం చెప్పారు..!

తెలంగాణ బ్యూరో, మన సాక్షి:

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లురి లక్ష్మణ్ కుమార్ లు భేటీ అయ్యారు. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో మంత్రుల మధ్య వివాదం ముగిసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , ఇతర ముఖ్య నేతలు మంత్రుల మధ్య సయోధ్య కుదుర్చారు.

సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, శివసేన రెడ్డి , సంపత్ కుమార్, అనిల్ , వినయ్ కుమార్ పాల్గొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..

సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ లో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను , మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాకు పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదన్నారు.

నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నా… నాకు అలాంటి ఆలోచన లేదు.. నేను ఆ ఒరవడి లో పెరగలేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతి నేర్పలేదని,
సామాజిక న్యాయానికి పోరాడే సందర్భంలో వ్యక్తిగత అంశాలు పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో బలహీనవర్గాల బిడ్డగా ఈరోజు రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాహుల్ గాంధీ సూచన మేరకు 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం జరుగుతుందన్నారు.

మేమంతా ఐక్యంగా భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తామని, లక్ష్మణ్ కి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్నా.. కరీంనగర్ లో మాదిగ సామాజిక వర్గం మేమంతా కలిసి పెరిగాం అన్నారు. ఆ అపోహ ఉండవద్ధని విజ్ఞప్తి చేస్తున్న అన్నారు.

MOST READ : 

  1. Nalgonda : అధిక వడ్డీ ఆశచూపి రూ.100 కోట్లు వసూలు.. అప్పు తీర్చకపోవడంతో వడ్డీ వ్యాపారి ఇంటికి నిప్పు పెట్టిన బాధితులు..!

  2. TG News : ప్రయాణికులకు భారీ షాక్.. బస్ చార్జీల పెంపు..!

  3. Alumni : ముప్పై ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం.. అవదుల్లేని ఆనందం..!

  4. Bike Driving : బైక్ నడిపేవారికి గుడ్ న్యూస్.. వెన్నునొప్పి తగ్గించే రహస్యాలు..!

మరిన్ని వార్తలు