TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Municipal Elections : మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్దం.. ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి..!

జిల్లాలో మున్సిప‌ల్‌ ఎన్నికల నిర్వ‌హ‌ణ‌కు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశామ‌ని, ఓటర్లు త‌మ ఓటు హ‌క్కును త‌ప్ప‌క వినియోగించుకోవాలని జిల్లా ఎన్నిక‌ల అధికారి, సూర్యాపేట క‌లెక్ట‌ర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగ‌ళ‌వారం తెలిపారు.

Municipal Elections : మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్దం.. ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి..!

సూర్యాపేట, మనసాక్షి :

జిల్లాలో మున్సిప‌ల్‌ ఎన్నికల నిర్వ‌హ‌ణ‌కు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశామ‌ని, ఓటర్లు త‌మ ఓటు హ‌క్కును త‌ప్ప‌క వినియోగించుకోవాలని జిల్లా ఎన్నిక‌ల అధికారి, సూర్యాపేట క‌లెక్ట‌ర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగ‌ళ‌వారం తెలిపారు.

ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఎన్నిక‌లు స‌జావుగా, నిష్ప‌క్ష‌పాతంగా, పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించుట‌కు అన్ని ఏర్పాటు పూర్తి చేశామ‌ని, జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలో ఉద‌యం 7.00 గంట‌ల నుండి పోలింగ్ ప్రారంభం అయి సాయంత్రం 5.00 గంట‌ల‌కు ముగుస్తుంద‌ని తెలిపారు
ఈ నెల 11వ‌, తేది (బుధ‌వారం) రోజున ఎన్నిక‌ల జ‌రుగ‌నున్న సంద‌ర్బంగా పోలింగ్ బూతుల వ‌ద్ద ఏలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా పోలీస్ బందోబ‌స్తును ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును స్వేచ్ఛగా వినియోగించుకు నేందుకు పోలింగ్ కేంద్రాల‌కు త‌ర‌లి వ‌చ్చే స‌మ‌యంలో గుర్తింపు కార్డుల‌లో ఏదైనా ఒకటి అన‌గా ఓట‌ర్ కార్డు, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫోటో కూడిన పోస్టు ఆఫీసు కార్డు, డైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, లేబ‌ర్ గుర్తింపు కార్డు, ఇండియ‌న్ పాస్ పోర్టుతొ జారీ చేయ‌బ‌డిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, దివ్యాంగుల గుర్తింపు కార్డు అలాగే అధికారిక గుర్తింపు కార్డులు త‌దిత‌ర వాటిలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటు వేయ‌వ‌చ్చ‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

ఓట‌ర్లు ఓటు హ‌క్కును నూరు శాతం వినియోగించుకుని ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు తొడ్పాటును అందించాల‌న్నారు.
జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో 141 వార్డులలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. పోలింగ్ కట్టుదిట్టంగా నిర్వహించేందుకు 446 పోలింగ్ అధికారులు, 446 ఏపీఓ, 1340 ఓపిఓ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎన్నికల సజావు నిర్వహణకు 51 మంది జోనల్ అధికారులు, 46 మంది రూట్ అధికారులు నియమించామన్నారు. స్వేచ్ఛ, న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణకు 10 ఎస్ఎస్ టీ, 15 ఎఫ్ ఎస్ టీ, 7 వీవీటి, ఏటి 7బృందాలు ఏర్పాటు చేశామన్నారు. పోటీదారుల వ్యయ నియంత్రణకు 5 గురు ఏఇఓ లు, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. 55 మంది మైక్రో అబ్జర్వార్లను నియమించినట్లు కలెక్టర్ అన్నారు. ఎన్నికల సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు, తిరిగి పోలింగ్ కేంద్రాల నుండి స్ట్రాంగ్ రూమ్ కు తరలింపుకు 46 బస్సులను సిద్ధం చేసినట్లు, పోలీస్ ఎస్కార్టుతో బందోబస్తుకు కార్యాచరణ చేసినట్లు తెలిపారు.

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్చ, న్యాయబద్దంగా జరిగేలా అన్ని వర్గాల వారు సహకరించాలని కలెక్టర్ కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ లు జనరల్ అబ్జర్వర్ పాండదాస్ తో కలిసి ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని, కౌంటింగ్ సెంటర్ ను
పరిశీలించారు.వీరి వెంట ఆర్డిఓ వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. Narayanpet : ఎన్నికల సామాగ్రి పంపిణీ.. కేంద్రంను సందర్శించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!

  2. Miryalaguda : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి.. ఓటర్లు సిబ్బంది ఎంతమందటే..!

  3. Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీ పై ఎగిరే జెండా.. అభివృద్ధే ఎజెండా, గెలుపెవరిది..!

  4. కంటతడి పెట్టిస్తున్న సుసైడ్ లెటర్.. తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం.. పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య..!

మరిన్ని వార్తలు