TOP STORIESతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల వేడి.. అధికార కాంగ్రెస్ లో వారంతా పోటీకి నై..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. అధికారులు ఎన్నికల నిర్వహణకు కసరత్తు నిర్వహిస్తుండగా ఆయా రాజకీయ పార్టీల నాయకులు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

Miryalaguda : మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల వేడి.. అధికార కాంగ్రెస్ లో వారంతా పోటీకి నై..!

మనసాక్షి, మిర్యాలగూడ :

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. అధికారులు ఎన్నికల నిర్వహణకు కసరత్తు నిర్వహిస్తుండగా ఆయా రాజకీయ పార్టీల నాయకులు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ఇప్పటికే మొదలయ్యింది. మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా కొనసాగనున్నాయి.

మిర్యాలగూడ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. కాగా ఎలాగైనా అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు టిఆర్ఎస్, బిజెపి పార్టీలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా దూకుడు పెంచింది. ఇది ఇలా ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ల హడావుడి మొదలయ్యింది.

చైర్మన్ సీటు పై గురి :

మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ స్థానం రిజర్వేషన్ పై పట్టణంలోని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కన్నేశారు. సీనియర్ నేతలుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు చైర్మన్ స్థానం తమకు అనుకూలంగా రిజర్వేషన్ వస్తే ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నం ఇప్పటినుంచే కొనసాగించారు. చైర్మన్ స్థానం రిజర్వేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఎన్నికల్లో పోటీకి నై :

అధికార కాంగ్రెస్ పార్టీలో తాజా మాజీ కౌన్సిలర్లు చాలామంది ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైర్మన్ రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తేనే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వారంతా రెండు, మూడు పర్యాయాలు కౌన్సిలర్లుగా గెలుపొంది.. సీనియర్ నేతలుగా కొనసాగుతున్నారు. మరోసారి కౌన్సిలర్ స్థానం కోసం పోటీ చేయాలనే ఆలోచన వారిలో లేదు. కేవలం చైర్మన్ స్థానం తమకు రిజర్వేషన్ అనుకూలిస్తే పోటీ చేయాలని భావిస్తున్నారు. చైర్మన్ గిరి స్థానం అవకాశం రాకుంటే కౌన్సిలర్లుగా పోటీ చేసే అవకాశాలు లేవు.

కొత్తవారు పోటీ చేస్తే పరిస్థితులు..?

మిర్యాలగూడ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఎన్నికలకు దూరంగా ఉంటే కొత్తవారు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్తవారికి కౌన్సిలర్ టికెట్లు ఇస్తే ఎన్నికలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది. కౌన్సిలర్ పోటీ కి దూరంగా ఉండే సీనియర్ నేతలు పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తారా..? లేదా.వ? అనేది వేచి చూడాల్సి ఉంది.

MOST READ 

  1. Alumni : 40 సంవత్సరాల తర్వాత కలయిక.. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..! 

  2. Yadadri : యాదాద్రి జిల్లాలో నిండు గర్భిణీ పట్ల నిర్లక్ష్యం.. ఆసుపత్రిలో కనిపించని సిబ్బంది..!

  3. Yadadri : యాదాద్రి జిల్లాలో నిండు గర్భిణీ పట్ల నిర్లక్ష్యం.. ఆసుపత్రిలో కనిపించని సిబ్బంది..!

  4. Suryapet : మంచినీళ్లు రాక రెండు నెలలు.. ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ వద్ద మహిళల నిరసన..!

మరిన్ని వార్తలు