MUNICIPAL ELECTIONS : తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ ప్రారంభం.. పట్టణాల్లో హై అలర్ట్..!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం ఏడు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రారంభమైంది.

MUNICIPAL ELECTIONS : తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ ప్రారంభం.. పట్టణాల్లో హై అలర్ట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం ఏడు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కోసం పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
మొత్తం మున్సిపాలిటీలలో 2582 వార్డులకు గాను 12 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవం కాగా ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. దాంతో 2569 వార్డుల్లో పోలింగ్ జరుగుతున్నది. అన్ని మున్సిపాలిటీలలో 6017 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా అన్ని వార్డులలో 10,719 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
మున్సిపల్ కార్పొరేషన్ లలో 414 వార్డులకు గాను రెండు వార్డులు అభ్యర్థులు ఏకగ్రీవం కాక 412 వార్డులలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. అందుకుగాను 2174 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 2,225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52 ,17,413 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 25, 49,750 మంది పురుషులు ఉండగా 26 లక్షల 67 వేల 25 మంది మహిళలు ఉన్నారు. 638 మంది ఇతరులు ఉన్నారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 41,773 మంది పోలింగ్ సిబ్బంది నియమించబడ్డారు. పకడ్బందీగా ఎన్నికలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ రాణి కుముదిని తెలిపారు.
MOST READ
-
ACB : రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన యువ ఎస్సై..!
-
Municipal Elections : మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దం.. ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి..!
-
Municipal Elections : మిర్యాలగూడలో కోవర్ట్ రాజకీయాలు.. స్థానికేతరులను ఆదరించేనా..!
-
కంటతడి పెట్టిస్తున్న సుసైడ్ లెటర్.. తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం.. పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య..!









