Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Municipal Elections : మిర్యాలగూడలో కోవర్ట్ రాజకీయాలు.. స్థానికేతరులను ఆదరించేనా..!

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో కోవర్ట్ రాజకీయాలు సాగుతున్నాయని చెప్పవచ్చు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రకటనకు ముందు వార్డుల కేటాయింపులో తమకే సీటు వస్తుందని భావించిన వారంతా రిజర్వేషన్ల ప్రక్రియ అనంతరం తారు మారయింది.

Municipal Elections : మిర్యాలగూడలో కోవర్ట్ రాజకీయాలు.. స్థానికేతరులను ఆదరించేనా..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో కోవర్ట్ రాజకీయాలు సాగుతున్నాయని చెప్పవచ్చు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రకటనకు ముందు వార్డుల కేటాయింపులో తమకే సీటు వస్తుందని భావించిన వారంతా రిజర్వేషన్ల ప్రక్రియ అనంతరం తారు మారయింది.

దాంతో వారు అనుకున్న వార్డుల్లో రిజర్వేషన్లు కుదరకపోవడంతో పక్క వార్డుల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఎన్నికల ప్రచార సమయంలో తమకు ఎవరు అనుకూలంగా ఉన్నారో..? ఎవరు అనుకూలంగా లేరో..? చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. అభ్యర్థుల వెంట తిరుగుతున్న వారు కోవర్ట్ రాజకీయాలకు పాల్పడుతున్నట్టు కొన్ని వార్డులలో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

ఎన్నికలకు మరొక రోజు మాత్రమే గడువు ఉండడంతో కోవర్టులకు చెక్ పెట్టి తాము గెలిచే విధంగా ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో చివరి రోజు పోలింగ్ ముందు రోజే కీలకం కావడంతో తాము ఎలాగైనా గెలవాలంటే కోవర్టులు ఎవరనే విషయాన్ని తెలుసుకోవాలని కొంతమంది అభ్యర్థులకు స్థానికులు కూడా సూచిస్తున్నట్లు సమాచారం.

స్థానికేతరులను ఆదరించేనా..?

మిర్యాలగూడ మున్సిపాలిటీలో స్థానిక వార్డులలో రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో పక్క వార్డులలో పోటీ చేసిన వారు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలలో కూడా అభ్యర్థులు ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో తమ వార్డులో ఉండే వారిని కాకుండా పక్క వార్డులో ఉండే వారిని ఎన్నుకుంటే ప్రయోజనం ఉంటుందా..? ఉండదా.? అని ఓటర్లు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

తమ వార్డుకు అభివృద్ధి జరగాలంటే తమ వార్డులో ఉండే వారిని గెలిపిస్తేనే ఎంతో కొంత మేలు జరుగుతుందని, పక్క వార్డులో ఉండే వారిని గెలిపిస్తే తమ వార్డుకు ఎలాంటి ప్రయోజనం వస్తుందో అని ఓటర్లు భావిస్తున్నట్లు సమాచారం. దాంతో స్థానికేతలను ఓటర్లు ఆదరిస్తారా..? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

MOST READ 

  1. Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీ పై ఎగిరే జెండా.. అభివృద్ధే ఎజెండా, గెలుపెవరిది..!

  2. కంటతడి పెట్టిస్తున్న సుసైడ్ లెటర్.. తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం.. పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య..!

  3. Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా డేట్ ఫిక్స్..!

  4. నల్గొండ జిల్లాలో మద్యం మత్తులో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. గ్రామస్తుల దేహశుద్ధి..!

మరిన్ని వార్తలు