క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

BREAKING NALGONDA : భూ తగాదాలలో కర్రలు,  రాడ్లతో పరస్పర దాడులు.. 14 మందిపై కేసు..! 

BREAKING NALGONDA : భూ తగాదాలలో కర్రలు,  రాడ్లతో పరస్పర దాడులు.. 14 మందిపై కేసు..! 

నల్లగొండ. మన సాక్షి :

గత కొన్ని సంవత్సరాలుగా నివురుగప్పిన నీరుల ఉన్న
భూ తగదా ఒక్కసారిగా భగ్గుమంది. భూ పంపకంలో తేడాలు వచ్చాయని కొన్ని సంవత్సరాలుగా పంచాయతీలు పెట్టుకుని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. అయిన పంచాయతీ తెగతెంపులు కాకపోవడంతో చేసేది లేక నలుగురు అన్నదమ్ముల్లో ముగ్గురి కుటుంబీలు మరోక కుటుంబంపై కర్రలు, ట్రాక్టర్ రాడ్డులతో విచక్షణ రహితంగా దాడీ చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈసంఘటనలో సుమారు నలుగురకి వ్యక్తులకు తీవ్రగాయాలుకాగా మరికొంతమందికి స్వల్పగాయాలు అయ్యాయి.

వీరంతా నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఇరువురి ఫిర్యాదుల మేరకు నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు ఇరువర్గాలకు చెందిన 14 మందిపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్లితే నల్లగొండ మండలంలోని నర్సింగ్ భట్ల గ్రామానికి చెందిన కారింగు వీరయ్యకు గ్రామంలోని 64,65,66,68 సర్వే నెంబర్లల్లో సుమారు 56.14 ఎకరాల భూమి ఉంది. ఇతనికి ఎల్లయ్య, రామయ్య, మారయ్య, పిచ్చయ్య అనే నలుగురు కుమారులు ఉన్నారు.

ALSO READ : Srisailam : శ్రీశైలం నుంచి 10 గేట్లతో 4.36 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల, పర్యాటకుల సందడి, చంద్రబాబు జల హారతి..!

అప్పట్లో వీరు అన్నదమ్ములు అంతా గోలుసుతోకాకుండా తాళ్లలో కొలతల ప్రకారం భూపంపకాలు చేసుకున్నారు. ఇందులో కొంత వీరందరికి సమభాగాలు కాకుండా ఇసుకవాగు ఉండడంతోపాటు భూముల స్వరుపాలను బట్టి ఎచ్చుతగ్గులుగా పంపకం చేశారు. ఈ పంపకంలో ఎల్లయ్యకు 13 ఎకరాలు, మారయ్యకు 13.30 ఎకరాలు, పిచ్చయ్యకు 14.10 ఎకరాలు రామయ్యకు 15.20 గుంటల భూమి పంపకంలో వచ్చింది. ఆదే పంపకాన్ని గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు.

కాలక్రమేణ అట్టి భూములు కూడా సారంతంగా కావడం, బాటలు, కాలువలు సక్రమంగా లేకపోవడంతో నలుగురు అన్నదమ్ములు వారి కుటుంబాల సభ్యుల ఇటివల సమాన బాగాలు చేసుకోవాలని పంచాయతీ నిర్వహించారు. ఇందులో రామయ్య కుటుంబీకులు మినహా మిగత వారంతా ఒకటాటిపైకి రావడంతో అందరూ 13.30 ఎకరాల భూమిని సమానంగా పంచుకున్నారు. రామయ్య భాగంలో 15.20 (ఆదనంగా 1.20 ఎకరాలు) ఎకరాల భూమి ఉంది.

ALSO READTelangana : ఆడబిడ్డలను అవమానిస్తారా.., అన్ ఫిట్ సీఎం, రేవంత్ పై కేటీఆర్ ఫైర్..!

ఇందులో కొంత భూమి సేద్యానికి పనికిరాకుండా ఉండడంతో దాన్ని మినహాయించి మిగతా భూమిని సమానంగా పంపకాలు చేయాలని పంచాయతీ పెట్టడంతో అన్నదమ్ముల కొడుకుల మధ్య భూతగలకు దారి తీసింది. రామయ్య ఇటివల మరణించగా ఆయన పేరున ఉన్న 15.20 ఎకరాల భూమిని తన కొడుకులు బిక్షం, సైదులుకు సమాభాగాలుగా పంచుకున్నారు. దీంతో మిగతా కుటుంబీకులు కూడా పంచాయతీ నిర్వహించారు.

దీనికి వారు గతంలో జరిగిన పంపకంలో కొంత స్వేద్యంకాని భూమి ఇవ్వడంతో మేము తీవ్రంగా నష్టపోయామని అంతే భాగంలో ఉంటామని చెప్పారు. ఈ పంచాయతీ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో పెద్ద మనుషుల సమక్ష్యంలో పలుమార్లు పంచాయతీ నిర్వహించారు. అక్కడ పంచాయతీ పరిష్కారం కాకపోవడంతో పోలీస్ స్టేషన్కు కూడా వెళ్లారు. అక్కడ కూడా ఏకాభిప్రాయం రాకపోవడంతో కోర్టుకు వెళ్లాలని పోలీసులు సూచనలు చేశారు.

ఈక్రమంలో బుధవారం రోజున రామయ్య కుమారులు సైదులు, బిక్షంలు నాటు వేశారు. ఇది తెలిసిన మిగతా కుటుంబీకులు ఆదేరాత్రి వెళ్లి పంచాయతీలో ఉన్న ఎకరం 20 గుంటల భూమిని ట్రాక్టర్లతో దున్ని చెడగోట్టారు. ఈ విషయం తెలిసిన సైదులు, బిక్షం కుటుంబీకులు గురువారం రోజున అక్కడికి వెళ్లడంతో వారి మద్య గొడవ జరుగగా వెంటనే కర్రలు, ట్రాక్టర్ల రాడ్లు తీసుకుని వచ్చి సైదులు, బిక్షం కుటుంబ సభ్యులపై విచక్షణరహితంగా దాడి చేశారు. అడ్డువచ్చిన మహిళలపై కూడా దాడి చేశారు.

ఇరువురు వర్గాలు కూడా బాడి చేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చుట్టుపక్కల వాళ్లు వచ్చి వారిని విడిపించగా గాయలైన వారిని అసుపత్రికి తరలించారు. ఇరువర్గాల వారు ఫిర్యాదు చేయడంతో 14 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ సైదాబాబు తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

Nagarjunasagar : నాగార్జునసాగర్ లో బాంబు స్క్వాడ్లు, జాగిలాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు..!

Ration Cards : కొత్త రేషన్ కార్డులపై క్యాబినెట్ కీలక నిర్ణయం.. సబ్ కమిటీ ఏర్పాటు..!

BREAKING : తెలంగాణలో గద్వాల ఎమ్మెల్యే ట్విస్ట్ రాజకీయం.. బుజ్జగింపులకు జూపల్లి భేటీ, అనంతరం హైదరాబాద్ కు..!

Srisailam : శ్రీశైలం వద్ద అధికారుల హై అలర్ట్.. భారీగా పెరిగిన వరద ఉధృతి.. Latest Update

మరిన్ని వార్తలు