Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

BREAKING : తెలంగాణలో గద్వాల ఎమ్మెల్యే ట్విస్ట్ రాజకీయం.. బుజ్జగింపులకు జూపల్లి భేటీ, అనంతరం హైదరాబాద్ కు..!

BREAKING : తెలంగాణలో గద్వాల ఎమ్మెల్యే ట్విస్ట్ రాజకీయం.. బుజ్జగింపులకు జూపల్లి భేటీ, అనంతరం హైదరాబాద్ కు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాజకీయాల్లో గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి రాజకీయం ట్విస్ట్ గా మారింది. బీఆర్ఎస్ లో గెలుపొందిన గద్వాల ఎమ్మెల్యే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేటీఆర్ తో భేటీ అయ్యారు. దాంతో బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.

కాగా తిరిగి బీఆర్ఎస్ కు కృష్ణమోహన్ రెడ్డి చేరుతున్నాడనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించాయి. ఆయనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు సంచలనం కలిగించాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది.

గురువారం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసానికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తిరిగి కాంగ్రెస్ లోనే కొనసాగే విధంగా బుజ్జగించి చర్చలు నిర్వహించినట్లు సమాచారం. జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ తో ఉన్న సంబంధాల మేరకే ఆయన అసెంబ్లీలో మాట్లాడారని కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారని పేర్కొన్నారు.

కృష్ణమోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యేవిధంగా జూపల్లి చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా భేటీ అనంతరం జూపల్లి కృష్ణారావుతోనే ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కూడా హైదరాబాదుకు బయలుదేరారు. కానీ కృష్ణ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడలేదు.

ఇవి కూడా చదవండి : 

Srisailam : శ్రీశైలం వద్ద అధికారుల హై అలర్ట్.. భారీగా పెరిగిన వరద ఉధృతి.. Latest Update

NALGONDA : అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల వల్ల స్వయం ఉపాధి.. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి..!

District collector : డంపింగ్ యార్డ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆయిల్, ఇటుకల తయారీని పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు