Breaking NewsTOP STORIESజాతీయం

Nagarjunasagar : నాగర్జున సాగర్ కు భారీగా పర్యాటకులు.. 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల..!

Nagarjunasagar : నాగర్జున సాగర్ కు భారీగా పర్యాటకులు.. 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల..!

మనసాక్షి, నాగార్జునసాగర్ :

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. 22 ట్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు భారీగా తరలి వచ్చారు. నాగార్జునసాగర్ మొత్తం సందడిగా మారింది. పోలీసులు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా సాగర్ ప్రాజెక్టు చూసేందుకు భారీగా తరలి వచ్చారు.

22 క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 1,71,974 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇన్ ఫ్లో : 1,98,152 క్యూసెక్కులు.

ఔట్ ఫ్లో : 2,13,660 క్యూసెక్కులు…

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు

ప్రస్తుత నీటి మట్టం : 587.30అడుగులు

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం : 305.6838 టీఎంసీలు

ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

పర్యాటకుల తాకిడి నేపద్యంలో జెన్ కో కార్యాలయం నుంచి డ్యాం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాగార్జున కొండ కు వెళ్ళే బోటింగ్ కేంద్రాల వద్ద పర్యాటకుల సందడి నెలకొన్నది.

MOST READ : 

  1. TG News : ఆ ఉద్యోగులే లక్ష్యంగా ఘరానా మోసం.. రూ.20 కోట్ల దోపిడి..!

  2. CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశం.. వారు తక్షణమే స్పందించాలి..!

  3. SBI : ఎస్బిఐ అదిరిపోయే ఆఫర్.. వారికి పూచికత్తు లేకుండా రూ.4 లక్షల రుణం..!

  4. TG News : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఆగస్టు 22 లోపే..!

మరిన్ని వార్తలు