తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nagarjunasagar : సాగర్ ప్రాజెక్టును పరిశీలించిన కె.జి.బి.ఓ చీఫ్ ఇంజనీర్..!

నాగార్జునసాగర్ ప్రాజెక్టును గురువారం నాడు కేంద్ర జల వనరుల సంఘం కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ఎంఎస్ సహారే సందర్శించి పరిశీలించారు.

Nagarjunasagar : సాగర్ ప్రాజెక్టును పరిశీలించిన కె.జి.బి.ఓ చీఫ్ ఇంజనీర్..!

నాగార్జునసాగర్, మన సాక్షి :

నాగార్జునసాగర్ ప్రాజెక్టును గురువారం నాడు కేంద్ర జల వనరుల సంఘం కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ఎంఎస్ సహారే సందర్శించి పరిశీలించారు. దీనిలో భాగంగా నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం తెలియజేసే ప్రాంతాన్ని, డ్యాం క్రస్ట్ గేట్ల విభాగాన్ని, కంట్రోల్ రూమ్ లను పరిశీలించారు. వీరికి సాగర్ ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఆండాలు, కృష్ణయ్య, సత్యనారాయణలు కేంద్ర జల వనరుల సంఘం చీఫ్ ఇంజనీర్ కి వివరించారు.

అనంతరం టెలీమెట్రి విధానాన్ని పరిశీలించారు. అనంతరం వీరు నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధ చరిత వనంలోని బుద్ధుని పాదాలు వద్ద పుష్పాంజలి ఘటించి వందనం సమర్పించారు. అనంతరం బుద్ధ చరితవనం, ధ్యానవనం, స్తూప వనాలను వీక్షించారు.

మహా స్తూపం లోని ధ్యాన మందిరంలో బుద్దవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రులు వీరిచే బుద్ధ జ్యోతులను వెలిగించిన అనంతరం బుద్దవనం కండువాలతో సత్కరించారు. సాగర్ సందర్శనలో భాగంగా నాగార్జునకొండ మ్యూజియాన్ని అక్కడ నిర్మించిన పునర్నిర్మిత కట్టడాలైన అశ్వమేద యజ్ఞశాల, మహాస్తూపం,సింహాల విహారాన్ని సందర్శించారు.

వీరికి స్థానిక టూరిజం గైడు సత్యనారాయణ నాగార్జునసాగర్ ప్రాజెక్టు, బుద్ధవనం, నాగార్జునకొండ చారిత్రక విశేషాలను వివరించారు. వీరితోపాటు( సి డబ్ల్యూ సి )కేంద్ర జల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధీరజ్ సింఘాల్, జె. ఇ. ఉమా శంకర్ తదితరులు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు