Nalgonda : బెట్టింగులకు అలవాటు పడి.. చివరికి అలా మారాడు..!
కేతేపల్లి మండల కేంద్రంలో కొన్ని రోజుల క్రితం పత్తిలోడుతున్న ట్రాక్టర్ ను దొంగతనం చేసిన ఇద్దరు నేరస్తులను అరెస్టు చేశామని నల్గొండ డి.ఎస్.పి శివరామిరెడ్డి తెలిపారు.

Nalgonda : బెట్టింగులకు అలవాటు పడి.. చివరికి అలా మారాడు..!
కేతేపల్లి, మనసాక్షి :
కేతేపల్లి మండల కేంద్రంలో కొన్ని రోజుల క్రితం పత్తిలోడుతున్న ట్రాక్టర్ ను దొంగతనం చేసిన ఇద్దరు నేరస్తులను అరెస్టు చేశామని నల్గొండ డి.ఎస్.పి శివరామిరెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన వీరబోయిన మహేష్ ఈనెల 8వ తారీఖున తన పత్తిని అమ్ముకోవడం కోసం ఇదే గ్రామానికి చెందిన జటంగి బుచ్చయ్య ట్రాక్టర్లో లోడ్ చేసి కొప్పుల ప్రదీప్ రెడ్డి ఆవరణలో అమ్మకo నిమిత్తం ఉంచటం జరిగిందని, మరుసటి రోజున ఉదయం ట్రాక్టర్ కనిపించకపోవడంతో జటoగి బుచ్చయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని తెలిపారు.
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల ప్రకారం, సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధన చేసిన పోలీసులు, భీమారం గ్రామానికి చెందిన నూకల కోటేష్, సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన అడెపు సాయికుమార్ లను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశామని ఆయన వివరించారు. నిందితుడైన నూకల కోటేశ్ ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి గతంలో కూడా ట్రాక్టర్ దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి విడుదల అయ్యాడని ఆయన తెలిపారు.
కోటేష్ విడుదలైన అనంతరం తన స్నేహితుడైన ఆడెపు సాయికుమార్ తో కలిసి కేతపల్లి మండల కేంద్రంలో తిరిగి దొంగతనం చేశాడని ఆయన వివరించారు. దొంగతనం చేసిన పత్తిలో కొంత బాల్యంలో మిల్లులో అమ్మారని మిగిలిన పత్తిని అయిటుపాముల పత్తి మిల్లులో అమ్మేటందుకు తీసుకువెళుచుండగా ఇనుపాముల గ్రామ శివారులో వారిని పట్టుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.
నిందితులనుంచి ట్రాక్టర్, ట్రాలీని , యూనికార్న్ బైక్ ను, 25 క్వింటాళ్ల పత్తిని, 50,000 నగదును స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో శాలిగౌరారం సిఐ కొండల్ రెడ్డి, కేతేపల్లి ఎస్సై యు. సతీష్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన శాలిగౌరారం సిఐని, కేతేపల్లి ఎస్సైని, పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు.









