Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : లోక్ అదాలత్ లో 13938 కేసులు పరిష్కారం..!

రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, నల్లగొండ ఆధ్వర్యం లో శనివారము జిల్లా లోని అన్ని కోర్ట్ ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు జిల్లా జడ్జి ఎం నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

Nalgonda : లోక్ అదాలత్ లో 13938 కేసులు పరిష్కారం..!

నల్లగొండ, మన సాక్షి.

రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, నల్లగొండ ఆధ్వర్యం లో శనివారము జిల్లా లోని అన్ని కోర్ట్ ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు జిల్లా జడ్జి ఎం నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ లోక్ అదాలత్ కొరకు జిల్లా వ్యాప్తంగా 16 లోక్ అదాలత్ బెంచిలను ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ లోక్ అదాలత్ లో 20 – సివిలు, 5535 – క్రిమినలు, 156- మోటార్ వాహన ప్రమాద భీమా కేసులు, మరియు 8125 – ఇతర ప్రీ – లిటిగేషన్ కేసులు, 37 – సైబర్ క్రైమ్ కేసులు, మొత్తం – 13938 (పెండింగ్ మరియు ప్రి-లిటిగేషన్) కేసులు పరిష్కరించబడినవని తెలిపారు.

ఇందులో ప్రమాద భీమా కేసులలో రూ.81310945/- నష్టపరిహారం ఇప్పించగ, సైబర్ క్రైమ్ కేసులో రికవరీ డబ్బులు రూ.276200/- యిప్పించడం జరిగిందని తెలిపారు.

కార్యక్రమములో జిల్లా జడ్జి, చైర్మన్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఎం.నాగరాజు , ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి శ్రీ పి.పురుషోత్తం రావు ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంత రెడ్డి , మంద నగేష్, ఇతర న్యాయవాదులు, లా కాలేజీ విద్యార్థులు, కక్షిదారులు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు