Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
Nalgonda : బిఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ హౌస్ అరెస్టు..!
సీఐడీ కార్యాలయం ముట్టడి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ను శనివారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

Nalgonda : బిఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ హౌస్ అరెస్టు..!
చింతపల్లి, మనసాక్షి :
సీఐడీ కార్యాలయం ముట్టడి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ను శనివారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఐడీ విచారణ పేరుతో వేదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని ఆయన కోరారు.
అరెస్టులతో ప్రజా ఉద్యమాలు ఆపలేరు అని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది అని ఆయన అన్నారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది.
ఇప్పుడు ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా చేతులెత్తేసింది అని ఆయన తెలిపారు. అభివృద్ధి మరిచి అరెస్టుల పేరుతో ప్రభుత్వం పబ్బం గడుపుతుంది అని ఆయన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
MOST READ
- Breaking : బొమ్మకల్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి..!
- Rythu Bharosa : రైతు భరోసా రెండో విడత ముహూర్తం ఫిక్స్.. ఎన్ని ఎకరాల కంటే..!
- Suryapet : కొత్తగూడెం చాకలి వాగు ఆర్డీవో ఆకస్మిక తనిఖీ.. ట్రాక్టర్ యజమానుల బైండోవర్ కు ఆదేశాలు..!
- జహీరాబాద్ లో ఘోరం.. కన్న తండ్రిని హత్య చేసిన తనయుడు..!









