Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

Paddy : ప్రారంభం కానీ కొనుగోలు కేంద్రాలు.. దళారుల పాలవుతున్న ధాన్యం..!

యాసంగి సీజన్ ప్రారంభమై రైతులు పండించిన ధాన్యాన్ని కోతలు, కోస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియక రైతులు తమ పంటలను దళారులకు విక్రయిస్తున్నారు.

Paddy : ప్రారంభం కానీ కొనుగోలు కేంద్రాలు.. దళారుల పాలవుతున్న ధాన్యం..!

అర్వపల్లి, మన సాక్షి :

యాసంగి సీజన్ ప్రారంభమై రైతులు పండించిన ధాన్యాన్ని కోతలు, కోస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియక రైతులు తమ పంటలను దళారులకు విక్రయిస్తున్నారు. యాసంగి సీజన్లో, ఏప్రిల్ నెలలో వడగండ్ల పడే అవకాశం ఉండడంతో రైతులు ముందు జాగ్రత్త చర్యగా నాట్లు వేసుకోవడంతో మార్చి చివరి వారంలోనే వరి పంటలు, చేతికొస్తుంది అని తెలిపారు.

మహిళా సంఘాలు, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా, కొనుగోలు చేస్తే రైతులకు క్వింటా 2400 రూపాయలు ధరవస్తుంది.
దళారులకు, మిల్లర్లకు, మధ్యవర్తులకు, రైతులు ధాన్యం అమ్మితే, 1700 లేకపోతే 1800 ధర వస్తుంది, ఒక క్వింటాకు 600 నుండి 700 రూపాయల నష్టంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో అమ్ముకుంటున్నారు.

లక్షలాది రూపాలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు ధాన్యం తక్కువ ధరకు అమ్మడంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనాలని రైతులు కోరుకుంటున్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు