Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

District collector : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కీలక వ్యాఖ్య.. ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం..!

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సమస్యల పరిష్కారానికే గ్రామసభలను ప్రభుత్వం నిర్వహిస్తున్నదని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా హాజరయ్యారు.

District collector : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కీలక వ్యాఖ్య.. ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం..!

కరీంనగర్, మనసాక్షి :

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సమస్యల పరిష్కారానికే గ్రామసభలను ప్రభుత్వం నిర్వహిస్తున్నదని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వం 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తున్నదని తెలిపారు.

గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం, రైతు భరోసా సన్న బియ్యం, పింఛన్లతో పాటు ఇతరత్రా పథకాలు లబ్ధి పొందుతున్న వారి వివరాలను గ్రామసభల్లో అధికారులు వెల్లడిస్తారని తెలిపారు.

పథకాల అమలులో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావచ్చని జిల్లా సూచించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను ప్రజలంతా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

గ్రామసభ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కే మహేశ్వర్ కరీంనగర్ రూరల్ తహసిల్దార్ నర్సింగరావు, స్థానిక సర్పంచ్ సాయిళ్ళ శ్రావణి, పలువురు అధికారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు