Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లాసంక్షేమం

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్..! 

ప్రజా ప్రభుత్వంలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా మండల కేంద్రంలోని మోత్కు పార్వతమ్మ కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేసి ప్రారంభించారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్..! 

వెల్దండ, మన సాక్షి :

ప్రజా ప్రభుత్వంలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా మండల కేంద్రంలోని మోత్కు పార్వతమ్మ కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ..అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చొరవతో మంజూరు చేయిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, కార్యదర్శి గిరి గౌడ్, వార్డు సభ్యులు మారేపల్లి మంజుల శ్రీను, ముదికొండ రమేష్, నాయకులు కొయ్యల పుల్లయ్య, తుంగ శ్రీను ,క్యాసరపు మల్లేష్, ఉడుత వెంకయ్య,జంగిలి ఆనంద్ , ఉడుత పరమేష్, డేవిడ్, మట్ట మల్లేష్ ,రాజు,లింగం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు