Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Meeseva : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. నేటి నుంచి మీ సేవ లకు అంతరాయం..! 

సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో 'మీ సేవ' ఆన్లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Meeseva : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. నేటి నుంచి మీ సేవ లకు అంతరాయం..! 

సూర్యాపేట, మనసాక్షి :

సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో ‘మీ సేవ’ ఆన్లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 3 సాయంత్రం 5గంటల నుంచి 5వ తారీకు ఉదయం 8 గంటల వరకు నిర్వహణ పనులు, సర్వర్ పనితీరు మెరుగుదల, భద్రతా వ్యవస్థల అప్ గ్రేడ్, సాంకేతిక సమస్యల నివారణ కోసం ఈ నిర్వహణ చేపడుతున్నారని.

ఈ సమయంలో సంబంధిత విభాగాలకు చెందిన ఆన్లైన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, వెబ్ పోర్టల్ సేవలు తాత్కాలికంగా పనిచేయవని, ప్రజలు అత్యవసర సేవలను ముందుగానే వినియోగించుకోవాలని సూచించారు. నిర్వహణ పూర్తయిన అనంతరం సేవలు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపారు.

సాంకేతిక వ్యవస్థలను ఆధునీకరించ డంలో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నామని, భవిష్యత్తులో వేగవంతమైన, అంతరాయం లేని సేవలను అందించేందుకు ఈ నిర్వహణ ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.

మరిన్ని వార్తలు