Nalgonda : మెడికల్ షాపుల బంద్.. వ్యాపారస్తుల ర్యాలీ..!
రాష్ట్ర కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపుమేరకు ఆన్లైన్ మెడికల్ సర్వీసెస్ బంధు చేయాలని నిరసన తెలుపుతూ మెడికల్ షాప్ యజమానులూ బుధవారం మెడికల్ షాపులు బంద్ చేసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Nalgonda : మెడికల్ షాపుల బంద్.. వ్యాపారస్తుల ర్యాలీ..!
నల్లగొండ, మన సాక్షి.
రాష్ట్ర కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపుమేరకు ఆన్లైన్ మెడికల్ సర్వీసెస్ బంధు చేయాలని నిరసన తెలుపుతూ మెడికల్ షాప్ యజమానులూ బుధవారం మెడికల్ షాపులు బంద్ చేసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 24 గంటల బందును చేపటినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కెమిస్ట్రీ ట్రక్ లిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు పరమాత్మ మాట్లాడుతూప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రతి పట్టణంలో రెండు ఎమర్జెన్సీ షాపులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఆన్లైన్ బిజినెస్ వల్ల లక్షలాదిమంది మెడికల్ షాప్ యజమానులు నష్టపోయే పరిస్థితి దాపురించిందని అదిగాక ఆన్లైన్లో నాసిరక మందులు యువతకు మత్తెక్కించే మందులు సరఫరా చేయడం వల్ల యువకులు మానసికంగా శారీరకంగా కృంగిపోయే పరిస్థితులు వస్తున్నాయి అన్నారు. కరోనా సమయంలో మందులను డోర్ డెలివరీ చేయడానికి తీసుకువచ్చిన 871 జీవో ప్రస్తుతం తమ పాలిట శాపంగా మారిందని ఈ జీవోను అడ్డుపెట్టుకొని కార్పొరేట్ కంపెనీలు మందులను ఆన్లైన్లో డోర్ డెలివరీ చేస్తూ మెడికల్ వ్యాపారస్తుల పొ ట్టగొడుతున్నారని వాపోయారు. వెంటనే 871 జీవో కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో, జిల్లా కార్యదర్శి గోవర్ధన్, జిల్లా కోశాధికారి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు పి రఘుపతి, పట్టణ కార్యదర్శి వి శ్రీనివాసులు, పట్టణ కోశాధికారి జి వెంకటేశ్వర్లు, సిహెచ్ పవన్ కుమార్, ఆర్ లక్ష్మీనారాయణ, జి శ్రీనివాస్, ధనుంజయ, శివాజీ, హరినాథ్, మత్స్యగిరి, వెంకటరెడ్డి, చంద్రశేఖర్ ఆజాద్, జానయ్య, రఘువరన్ వి, ప్రవీణ్, జ్ఞానేశ్వర్, భువనేశ్వర్, హరికుమార్త తదితరులు పాల్గొన్నారు.









