Nalgonda : నల్గొండలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థినిలు మృతి.. మరో యువకుడు కూడా ఆత్మహత్య..!
Nalgonda : నల్గొండలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థినిలు మృతి.. మరో యువకుడు కూడా ఆత్మహత్య..!
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థినులు మృతి
నల్గొండ లోనే మరో యువకుడి ఆత్మహత్య
నల్గొండ , మనసాక్షి :
నల్గొండ జిల్లా కేంద్రంలో ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నల్గొండలోని మహిళ డిగ్రీ కళాశాలలో వారిద్దరూ బి జెడ్ సి గ్రూప్ చదువుతున్నారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఉన్న ఎస్సీ హాస్టల్లో ఉంటూ డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు.
వీరిద్దరు కూడా నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామానికి చెందిన దొంతర బోయిన శివాని, అదే మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన అనుగూతుల మనీష. కాగా వీరిద్దరు కూడా ఇంటర్మీడియట్ నుంచే స్నేహితులుగా కొనసాగుతున్నారు.
ఇటీవల కాలంలో 20 రోజుల నుంచి కళాశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నారు. మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్తున్నామని చెప్పి నల్గొండకు వచ్చారు. కాగా నల్గొండలోని ఎన్జీ కళాశాల వెనుక ఉన్న రాజీవ్ పార్కులో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. గడ్డి మందు తాగిన అనంతరం పార్కు గేటు వద్దకు వచ్చి ఇరువురు గట్టిగా అరిచారు.
ALSO READ :
- Big Alert : టీఎస్పీఎస్సీ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- పిడుగుపాటుకు ఇద్దరు కూలీల మృతి..!
- సూర్యాపేట : సద్దుల చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
- Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!
దాంతో సమీపంలో ఉన్న వారు పోలీసులకు 108 వాహనానికి సమాచారం అందించగా వారిని ఆసుపత్రిలో చేర్పించారు. కాగా వారు ఇరువురు చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. పోలీసుల విచారణలో వారిని ఇన్ స్టా గ్రామ్ లో బెదిరించారని చెప్పారు. కానీ వారిద్దరి ఫోన్లను పరిశీలించగా ఇన్ స్టాగ్రామ్ లో వారిని ఎవరు వేధించలేదని, ఫోన్ కాల్ డాటా పరిశీలించగా ఆ ఇద్దరు విద్యార్థుల మధ్యనే ఎక్కువ సంభాషణ ఉన్నట్లు తెలిసింది.
ఇది ఇలా ఉండగా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారణ జరపాలని శివాని తండ్రి సైదులు, మనీషా తండ్రి మల్లయ్య టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా వారిద్దరి బ్యాగులలో నిద్ర మాత్రలు లభించాయని, గడ్డి మందు కూడా నార్కట్ పల్లిలో కొనుగోలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకనే ఆత్మహత్యయత్నానికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం . పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.
నల్గొండలో మరో యువకుడు ఆత్మహత్య :
నల్గొండ జిల్లా కేంద్రంలోని బుధవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. చింతమల్ల శ్రీనివాస్ కు కుమారుడు చింతమల్ల దిలీప్ చక్రవర్తి (24) డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేశాడు. సెల్ఫోన్ దుకాణంలో పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే శ్రీనివాస్ ఆఫీస్ కి వెళ్ళగా చిన్న కుమారుడు కళాశాలకు, కుమార్తె స్కూలుకు వెళ్లారు.
సెల్ఫోన్ దుకాణానికి వెళ్లేందుకు సమయం కావడంతో తల్లి ఉషారాణి దిలీప్ చక్రవర్తిని నిద్రలేపే ప్రయత్నం చేసింది. నిద్ర నుంచి లేపి ఆమె బాత్రూంకు వెళ్ళింది. అదే సమయంలో దిలీప్ చక్రవర్తి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిలీప్ చక్రవర్తిని తల్లి చూసి కేకలు వేయగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. దిలీప్ తండ్రి శ్రీనివాస్ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.









