పిడుగుపాటుకు ఇద్దరు కూలీల మృతి..!

పిడుగుపాటుకు ఇద్దరు కూలీల మృతి..!
జయశంకర్ భూపాలపల్లి , మన సాక్షి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం కైలాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చిట్యాల మండల కేంద్రంలోని రామ్ నగర్ కు చెందిన చిలువేరు సరిత (40) , నేర్పాటి మమత (30) కొంతమంది మహిళా కూలీలతో కలిసి మిరప నారు నాటేందుకు కూలీ పనులకు వెళ్లారు.
ALSO READ :
- Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!
- Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)
- Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!
- Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
మంగళవారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన భారీ వర్షం రావడంతో కూలీలంతా చెట్టు కిందికి వెళ్లారు. కాగా ఒకేసారి పిడుగు పడటంతో సరిత , మమతలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో భద్రమ్మ ,కొమరమ్మ, ఉమ, శివ కు తీవ్రంగా గాయాలయ్యాయి.108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు వరంగల్ ఎంజీఎం కు తరలించారు. ఒకే కాలనీకి చెందిన ఇద్దరు మహిళ కూలీలు పిడుగుపాటుతో మృతి చెందడం వల్ల గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.