హైదరాబాద్Breaking Newsతెలంగాణసినిమా

Miryalaguda : మూసా అలీఖాన్ కు జాతీయ అవార్డు..!

Miryalaguda : మూసా అలీఖాన్ కు జాతీయ అవార్డు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ నటుడు, నిర్మాత, సామాజికవేత్త డాక్టర్ మూసా అలీ ఖాన్ తెలంగాణ డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామ్ చందర్ నాయక్ చే నేషనల్ ప్రోమినెన్స్ అవార్డ్స్2025 అందుకున్నారు.

హైదరాబాదు బంజారాహిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగిన నేషనల్ ప్రోమినెన్స్ అవార్డుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ స్పీకర్ రామ్ చందర్ నాయక్, స్పెషల్ గెస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ అక్షర డైమండ్స్ అండ్ జువెలర్స్ కోటా కుమార్, అతిథులు టి ఎఫ్ ఐ డైరెక్టర్, సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, కార్యక్రమ నిర్వాహకులు అభినవ్.. డాక్టర్ మూసా అలీ ఖాన్ ను ఘనంగా సన్మానించారు.

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న డాక్టర్ మూసా అలీ ఖాన్ మాట్లాడుతూ నేషనల్ అవార్డు అందుకోవటం గర్వంగా సంతోషంగా ఉందని, డిప్యూటీ స్పీకర్ చేత అవార్డు తీసుకోవడం వల్ల నాకు బాధ్యత ఇంకా పెరిగిందని సేవా కార్యక్రమాలలో, సినిమా, టీవీ అవార్డుల కార్యక్రమాలలో పాల్గొంటూ ఎప్పటికప్పుడు నూతన కళాకారులను పరిచయం చేస్తూ కళా సంస్థలకు నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని అన్నారు. తనను ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

MOST READ : 

  1. SRR : పీహెచ్డీ పరిశోధన కేంద్రంగా ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల..!

  2. Dmart : డి మార్ట్ లో అతి తక్కువ చౌక ధరలకు సరుకులు కావాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!

  3. Nano Urea : రసాయన ఎరువులకు ధీటుగా నానో యూరియా.. రైతుల సమక్షంలో పిచ్చికారి..!

  4. TG News : మావోయిస్టు సిద్ధాంతకర్త, పార్టీకి బ్యాక్ బోన్.. పాఠాలు నేర్పిన ఆమె లొంగిపోయారు..!

మరిన్ని వార్తలు