Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసూర్యాపేట జిల్లా

Nano Urea : రసాయన ఎరువులకు ధీటుగా నానో యూరియా.. రైతుల సమక్షంలో పిచ్చికారి..!

Nano Urea : రసాయన ఎరువులకు ధీటుగా నానో యూరియా.. రైతుల సమక్షంలో పిచ్చికారి..!

సూర్యాపేట రూరల్, మనసాక్షి :

నానో యూరియా తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో రైతు బీరేల్లి రామచంద్ర రెడ్డి వ్యవసాయ క్షేత్రం లో నానొ యూరియా నానో డీఏవో మందు ను డ్రోన్ ద్వారా పిచికారీచేశారు.

ఈసందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నానో యూరియా వాడకం వల్ల దిగుబడిలో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని అత్యంత ప్రయోజన కారిణిగా ఉన్న నానో యూరియాని రైతులు వాడే విధంగా చూడాలన్నారు.

నానో యూరియా అనేది నానో టెక్నాలజీ సహాయంతో తయారు చేయబడిన ద్రవ రూపంలో ఉండే ఎరువు దీనిని వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. నానో యూరియా మొక్కలకు సమర్థవంతంగా నత్రజనిని అందిస్తుందని , పంట దిగుబడిని పెంచడంలో సహాయపడుతుందన్నారు.

సాంప్రదాయ యూరియా వాడటం వల్ల పర్యవరణ కాలుష్యం, భూగర్భ జల వనరులకు ఇబ్బంది కలగడమే కాకుండా, నేలకు కూడా చాలా నష్టం కలుగుతుందన్నారు. సాంప్రదాయ యూరియాతో పోలిస్తే నానో యూరియా తక్కువ మొత్తంలో వాడడం వల్ల..ఇది మట్టి, నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు
అధిక దిగుబడి తో పాటు మెరుగైన పోషక విలువలతో కూడిన పంటలను పండించడానికి నానో యూరియా సహాయపడుతుందన్నారు

.నానో యూరియా ద్రవ రూపంలో ఉండటం వల్ల, రవాణా, నిల్వ చేయడం సులభతరమన్నారు
క్షేత్ర స్థాయిలో రైతుల తో సమావేశం ఏర్పరచి నానో యూరియా వాడకం పైన విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. పంటలకు రసాయన ఎరువులు వేస్తేనే దిగుబడులు వస్తాయన్న ఆలోచనలో రైతులు ఉన్నారని… పంట ఆరోగ్యం, నాణ్యమైన ఉత్పత్తికి పచ్చిరొట్ట, సేంద్రియ, జీవన ఎరువులు ఎలా ఉపయోగపడతాయో నానో యూరియా కూడా అంతేనని అధికారులు రైతులకు వివరించాలి.

పంటలకు పోషకాలు అందించడంలో రసాయన ఎరువులకు ధీటుగా నానో ఎరువులు పనిచేస్తయన్నారు. సంప్రదాయ యూరియా నత్రజని వాయువుగా మారి వాతావరణంలోకి విడుదలై పర్యావరణానికి హాని చేస్తుందని… రసాయన యూరియా అధిక వాడకం వల్ల పొటాష్‌, పాస్పరస్‌ లభ్యతను తగ్గిస్తుందని… నానో యూరియా స్ప్రే చేయడం తో పాటు పురుగు మందులు కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చు తద్వారా ఖర్జు తగ్గుతుంది.

నత్రజనిని వేగంగా విడుదల చేసే సంప్రదాయ యూరియా కంటే.. నానో యూరియా వాడితే మంచిది అని తెలిపారు. సారవంతమైన నేలను కాపాడుకోడానికి నానో ఎరువుల వాడకం మంచిదని నానో సాంకేతికపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్, ఏఈవో సుష్మా,డ్రోన్ ఆపరేటర్ మధుసూదన్, రైతులు బీరేల్లి రామచంద్ర రెడ్డి, పాలకుర్తి శ్రీనివాస్ గౌడ్ ఆరాల సైదులు, వీరసోములు, గౌనీ లక్ష్మయ్య ,బోర్రాజు అవిలయ్య , ఉప్పల లక్ష్మయ్య,సందీప్ పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి (MOST READ)

  1. PMKY : రైతుల ఖాతాలలోకి రూ.18 వేలు.. ఇలా చేస్తే చాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Govt Scheme : ఆ రైతులకు అదిరిపోయే స్కీం.. ఎకరానికి రూ.9600 రాయితీ..!

  3. Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద ప్రవాహం.. అవుట్ ఫ్లో 4.83 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Mosquito : దోమల ద్వారా వచ్చే వ్యాధులేంటో.. ఎప్పుడొస్తాయో తెలుసా.. సర్వేలో ఆసక్తికర విషయాలు..!

  5. Kodada : కోదాడ క్లస్టర్ ఉద్యాన విస్తరణ అధికారిగా ముత్యంరాజు.. ఎవరో తెలుసా..!

మరిన్ని వార్తలు