TOP STORIESBreaking Newsవ్యవసాయం

Paddy : వరిలో నూతన వంగడం, 45 రోజులకే పొట్ట దశకు.. పరిశీలించిన శాస్త్రవేత్తలు..!

Paddy : వరిలో నూతన వంగడం, 45 రోజులకే పొట్ట దశకు.. పరిశీలించిన శాస్త్రవేత్తలు..!

చింతపల్లి, మన సాక్షి :

తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి సాధించేందుకు రైతులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. రైతులు ఆదాయం మార్గాలను పెంచుకునేందుకు నూతన వంగడాల వైపు మళ్తున్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఓ రైతు వరి నూతన వంగడం నాటాడు. 45 రోజులకే వరి పొట్ట దశకు వచ్చింది.

వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చింతపల్లి గ్రామానికి చెందిన రైతు కడారి వెంకటయ్య, కేతావత్ సోమల నాయక్ KNM 118 రకం వరి పంట చేను 45 రోజులకే పొట్టకు వచ్చింది.

శనివారం కృషి విజ్ఞాన కేంద్రం కంప సాగర్ శాస్త్రవేత్తలు డాక్టర్ కే చంద్రశేఖర్, జీ.శివప్రసాద్ లు ఆ రైతుల పంటను చేను సందర్శించి పరిశీలన చేశారు. పరిశోధన నివేదికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కి అందజేయనున్నట్లు వారి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారిని శ్రావణ కుమారి వ్యవసాయ శాఖ ఏఈవోలు ఏ. నరసింహ,ఎస్ మధు, ఏం మౌనిక, కార్తీక్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LATEST UPDATE : 

రిపోర్టింగ్ : వెంకట్, చింతపల్లి, 

76850 22610

మరిన్ని వార్తలు