Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

PONGULETI : దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా, త్వరలో నూతన రెవెన్యూ చట్టం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!

PONGULETI : దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా, త్వరలో నూతన రెవెన్యూ చట్టం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!

మన సాక్షి, నల్గొండ బ్యూరో :

ప్రస్తుత రెవిన్యూ చట్టంలో మార్పులను తీసుకువచ్చి దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా నూతన రెవెన్యూ (ఆర్ ఓ ఆర్ ) చట్టాన్ని తీసుకురానున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో తప్పొప్పులను సవరించి ,అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించి నూతన చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఉద్దేశించి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం, నెల్లికల్ గ్రామంలో నిర్వహించిన రైతుల ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి శనివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తెచ్చిన 2020 రెవెన్యూ చట్టం,ధరణి వల్ల రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని,, 2020 చట్టాన్ని అలాగే ధరణిలోని తప్పొప్పులను సవరించేందుకు దేశంలోని అన్ని రెవెన్యూ చట్టాలను పరిశీలించి మేలైన చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను సేకరించి పబ్లిక్ డొమైన్ లో ఉంచినట్లు తెలిపారు.

ఇందులో భాగంగానే తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం జరిగిందని ,నూతన రెవెన్యూ చట్టంపై ప్రజల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే చట్టం తీసుకురావాలని ,అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీల సూచనలు సైతం పరిగణలోకి తీసుకొని అతి కొద్ది రోజుల్లోనే నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకురాబోతున్నామని మంత్రి వెల్లడించారు.

అర్హులైన పేదవారికి. ప్రభుత్వ భూములు అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని ,ప్రత్యేకించి తిరుమలగిరి సాగర్ లో కొంతమంది పొజిషన్లో ఉన్నప్పటికి పట్టాలు లేవని, పట్టాలున్న వారికి భూమిలేదని, అలాగే ఎవాక్యూవేషన్ ప్రాపర్టీ కి సంబంధించి, ఇతర ప్రభుత్వ భూములకు సంబంధించిన చేస్తున్న సర్వే పూర్తయిన తర్వాత సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు.

మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ ధరణితో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ధరణిలోని తప్పులను, పాత చట్టంలోని తప్పులను సరి చేసేందుకు తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం సంతోషమని, గత రెండు నెలలుగా రెవెన్యూ అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారని, తిరుమలగిరి సాగర్ లోని భూముల సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. ఫారెస్ట్ భూములకు సంబంధించి సంయుక్త తనిఖీలు నిర్వహించి , ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు ఇవ్వాలని, అలాగే రిహాబిలిటేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అడవిదేవులపల్లి, దామరచర్ల మండలాల్లో సైతం గతంలో పట్టాలు ఇచ్చినప్పటికి ధరణిలో నమోదు కాక రుణమాఫీ వంటివి రైతులకు రాలేదని, అందువల్ల తిరుమల గిరి సాగర్ మాదిరిగానే అడవిదేవులపల్లి, దామరచర్ల మండలాలలో సైతం సర్వే నిర్వహించాలని కోరారు.

ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఫారెస్ట్ భూములు సాగు చేసుకుంటున్న రైతులను గుర్తించి పట్టాలి ఇవ్వాలని, కొన్నిచోట్ల రైతులు అటవీ భూముల్లో సేద్యం చేసుకుంటున్నచోట అధికారులు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు.

నాగార్జునసాగర్ శాసనసభ్యులు జయవీర్ మాట్లాడుతూ తిరుమలగిరి సాగర్ తో పాటు ,రాష్ట్రవ్యాప్తంగా ధరణి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి సాగర్ ని ఎంపిక చేయడం జరిగిందని, దీంతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.

అంతకు ముందు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తిరుమలగిరి సాగర్ లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన, నూతన చట్టం కింద నిర్వహించిన సర్వే వివరాలను ,భూముల వివరాలను తెలియజేస్తూ మండలం మొత్తంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని , 8 గ్రామాలలో భూ సమస్యలు ఉండగా, పట్టాల భూములలో సైతం సమస్యలు ఉన్నాయని, 8597 ఎకరాలు ప్రభుత్వ భూమి ,3400 ఎకరాలు ఫారెస్ట్ భూమి ఉందని, మొత్తం 16600 ఎకరాలు రెండు నెలల్లో సర్వే చేయడం జరిగిందని, గ్రామసభలు నిర్వహించి ప్రతి సర్వే నంబర్లో ఎంజాయ్ మెంట్ సర్వే నిర్వహించి తర్వాత గ్రామపంచాయతీలో జాబితాను ప్రదర్శించి వాటిపై ఏదైనా అభ్యంతరాలు వస్తే పరిష్కరించడం జరిగిందని, మిస్సింగ్ సర్వే నంబర్లను స్పష్టంగా రాయడం జరిగిందని తెలిపారు.

అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కర్ణటి లింగారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు