Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District collector : డిజిటల్ సర్వేలో ఒక్క ఇంటిని కూడా వదలొద్దు.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : డిజిటల్ సర్వేలో ఒక్క ఇంటిని కూడా వదలొద్దు.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

నల్లగొండ, మన సాక్షి:

కుటుంబ డిజిటల్ కార్డు పైలెట్ సర్వే కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నల్గొండ మున్సిపల్ పరిధిలోకి వచ్చే 4వ వార్డు కేసరాజు పల్లి హ్యాపీ హోమ్స్, కేశరాజుపల్లి లో తనిఖీ చేశారు. నల్గొండ మున్సిపాలిటీ లో నల్గొండ ఇన్చార్జి ఆర్డీవో శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ ఆధ్వర్యంలో కుటుంబ డిజిటల్ కార్డు సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

కేశరాజు పల్లి లోని కుటుంబాలు? గృహాలు శుక్రవారం మధ్యాహ్నం వరకు సర్వే చేసిన కుటుంబాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బేస్ డేటా ఆధారంగా సర్వే నిర్వహించాలని, సర్వేలో ఎట్టి పరిస్థితులలో ఏ ఇంటిని వదిలిపెట్టకూడదని, అలాగే ఏ కుటుంబాన్ని వదలరాదని అన్నారు. ఏరోజు డేటా ను ఆ రోజే నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఫోటోలు తారు మారు కాకుండా చూసుకోవాలన్నారు. అలాగే కుటుంబాల వివరాల సేకరణ సందర్భంగా కొత్త కుటుంబాల నమోదు, ఎవరైనా వివాహమై వెళ్ళిపోయిన వారి తొలగింపు వంటివి ఎంట్రీ చేయాలన్నారు. ఏ రోజు పని ఆరోజే పూర్తికాలని ,ఎట్టి పరిస్థితులలో నిర్దేశించిన సమయానికి సర్వే పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. సర్వే బృందంలో ఎంపీడీవో, తదితరులు ఉన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు