జాతీయంBreaking News
తెలంగాణకు కొత్త గవర్నర్, ఎవరంటే.. 9 రాష్ట్రాల గవర్నర్ల నియామకం..!
దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేస్తూ.. ఆయన స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న శివ్ ప్రతాప్ శుక్లాను తెలంగాణకు నియమించింది.

తెలంగాణకు కొత్త గవర్నర్, ఎవరంటే.. 9 రాష్ట్రాల గవర్నర్ల నియామకం..!
మన సాక్షి:
దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేస్తూ.. ఆయన స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న శివ్ ప్రతాప్ శుక్లాను తెలంగాణకు నియమించింది. 2024 జూలైలో జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించింది.
తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లు వీరే :
- తెలంగాణ – శివ్ ప్రతాప్ శుక్ల
- మహారాష్ట్ర – జిష్ణు దేవ్ వర్మ
- నాగాలాండ్ – నంద్ కిషోర్ యాదవ్
- బీహార్ – రిటైర్డ్ లెఫ్ట్నెంట్ జనరల్ సయ్యద్ హస్నైన్
- ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ – తరంజిత్ సింగ్ సందు
- లడక్ లెఫ్ట్నెంట్ గవర్నర్ – వినయ్ కుమార్ సక్సేన
- హిమాచల్ ప్రదేశ్ – కవీందర్ గుప్తా
- తమిళనాడు గవర్నర్- రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్
- పశ్చిమబెంగాల్ గవర్నర్ – ఆర్ ఎన్ రవి









