TOP STORIESBreaking News

Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!

Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ వినియోగిస్తున్న విషయం తెలిసిందే. దానికి పోటీగా మన ఇండియన్ యాప్ అరట్టై వచ్చేసింది. ఎలాంటి నెట్‌వర్క్ ఏరియాలో ఉన్నా.. నార్మల్ గా స్మార్ట్ ఫోన్లో కూడా సులభంగా ఈ యాప్ పనిచేస్తుంది. ఇది అన్ని రకాల వినియోగదారులకు ఉపయోగపడుతుంది.

జోహో కార్పొరేషన్ యాప్ ను రూపొందించింది. మెసేజింగ్, కాలింగ్ యాప్ ను ఇది విడుదల చేసింది. భారతదేశంలో వాట్సాప్ జనాదరణ పొందినప్పటికీ అందుకు ప్రత్యామ్నాయంగా పరిగణిస్తున్నారు.

ఈ కొత్త యాప్ లో వాయిస్, వీడియో కాల్స్, మీడియా షేరింగ్, గ్రూప్ చాట్, చానల్స్, స్టోరీస్, ఆన్‌లైన్ మీటింగ్, లైవ్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది ఎలాంటి నెట్‌వర్క్ ఏరియాలో నైనా కూడా పనిచేస్తుంది.

ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే..?

గూగుల్ ప్లే స్టోర్ లో మెసెంజర్ జోహా కార్పొరేషన్ అని సెర్చ్ చేయాలి. ఇన్ స్టాల్ పై టాప్ చేయండి. లేదా అరట్టై అధికారిక వెబ్సైట్ నుండి నేరుగా ప్లే స్టోర్ లింకుకు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Note : థర్డ్ పార్టీ APK నుండి మాత్రం డౌన్లోడ్ చేయవద్దు.

ఇన్ స్టాల్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేసి దేశం పేరు, ఫోన్ నెంబర్ నమోదు చేయాలి. ఓటీపీతో వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత కాంటాక్ట్, మైక్రోఫోన్ కెమెరా నోటిఫికేషన్ లకు పర్మిషన్ ఇవ్వచ్చు. చివరగా ప్రొఫైల్ పేరు, ఫోటోలు కూడా సెట్ చేసుకోవచ్చును. దాంతో మిమ్ములను సులభంగా ఇతరులు గుర్తించే అవకాశం ఉంటుంది.

ఆటోమెటిక్ గా సెర్చ్ చేస్తుంది. ఎవరు ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు. అని కూడా చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా కాంటాక్ట్ యాప్ లో లేకపోతే మీరు ఎస్ఎంఎస్ ద్వారా వారిని ఆహ్వానించవచ్చు. యాప్ లో కాలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సీక్రెట్ చాట్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఇంకా కొత్త కొత్త చాలా ఫీచర్లు ఉన్నాయి. గ్రూప్ డిస్కషన్ల కోసం గ్రూప్స్ అప్డేట్స్, ప్రసారం చేయడానికి కూడా చానల్స్ షేర్ చేయడానికి స్టోరీస్ కూడా అందుబాటులో ఉంటాయి.

MOST READ : 

  1. District collector : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలిని అభినందించిన జిల్లా కలెక్టర్..!

  2. Bandi Sanjay : ఢిల్లీలోనే కాదు.. ఈసారి గల్లీ గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేయబోతున్నాం..!

  3. Fastrack : అదిరిపోయే లుక్‌తో ఫాస్ట్రాక్ కొత్త వాచెస్.. ఇకపై యూఎఫ్‌వోలు ఆకాశంలో కాదు, మీ చేతిలోనే..!

  4. Groups : తల్లి అంగన్వాడి ఆయా.. కుమారుడికి ఒకేసారి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్, నయాబ్ తహసిల్దార్, ఉద్యోగాలు..!

  5. Nelakondapalli : రూ.5 కోట్ల తో బౌద్ధక్షేత్రం చరిత్ర ప్రపంచం కు తెలిసేలా అభివృద్ధి..! 

మరిన్ని వార్తలు