Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలిని అభినందించిన జిల్లా కలెక్టర్..!

District collector : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలిని అభినందించిన జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మన సాక్షి :

నారాయణపేట మండలంలోని అప్పక్ పల్లి, అమ్మిరెడ్డి పల్లి గ్రామాలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం పరిశీలించారు. అప్పక్ పల్లి గ్రామంలో ఓ ఇంటి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచిన ఆ ఇంటి లబ్ధిదారురాలిని అభినందించారు.

అప్పక్ పల్లి గ్రామానికి మొత్తం 50 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, వాటిలో 16 ఇండ్ల నిర్మాణాలు రూఫ్ లెవల్, స్లాబ్, లెంటల్ లెవల్ లో కొనసాగుతున్నాయని హౌసింగ్ పీడీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. మిగతా 34 మంది లబ్ధిదారులు ఇంకా ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించలేదని, వారు కూడా ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించేలా వారికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు పీడీ తెలిపారు.

అలాగే అమ్మిరెడ్డి పల్లి గ్రామానికి మంజూరైన 15 ఇండ్ల నిర్మాణాలు కూడా వివిధ దశల్లో బేస్ మెంట్ లెవల్ లో కొనసాగుతున్నాయని ఆయన కలెక్టర్ కు చెప్పారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో నారాయణపేట మండలం పురోగతి లో ఉండటంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుదర్శన్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం.. బతుకమ్మ పండుగ..!

  2. Nalgonda : రెడ్డి జాగృతి.. బతుకమ్మ సంబరాలు సక్సెస్..!

  3. Elections : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. ఎన్నికల తేదీలు ఇవే..!

  4. Miryalaguda : వాడపల్లి యాస్సైపై ఎస్సీ ఎస్టీ శాఖ పరమైన చర్యలకు ఆదేశాలు..!

  5. Miryalaguda : రాష్ట్రస్థాయికి ఎంపికైన అభ్యాస్ స్కూల్ విద్యార్థులు..!

మరిన్ని వార్తలు