Bank New Rules : బ్యాంకుల కొత్త రూల్స్.. మినిమం బ్యాలెన్స్, విత్ డ్రా పై బాదుడే.. తెలుసుకోకపోతే భారీ నష్టమే..!
Bank New Rules : బ్యాంకుల కొత్త రూల్స్.. మినిమం బ్యాలెన్స్, విత్ డ్రా పై బాదుడే.. తెలుసుకోకపోతే భారీ నష్టమే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బ్యాంకు ఖాతాల నియమ నిబంధనలు ఎప్పటికప్పుడు RBI రూల్స్ ప్రకారం మారు తున్నాయి. దేశవ్యాప్తంగా అనేక బ్యాంకులు ఏప్రిల్ 1 నుంచి రూల్స్ మార్చబోతున్నాయి. ఒక్కొక్కరికి 2, 3 బ్యాంకు ఖాతాలు కూడా ఉన్నాయి. వాటిలో మినిమం బ్యాలెన్స్, విత్‌డ్రా కు సంబంధించిన నియమ నిబంధనలు మారుతున్నాయి. వాటిని తప్పనిసరిగా బ్యాంకు వినియోగదారు తెలుసుకోవాల్సి ఉంది. లేకుంటే భారీగా నష్టపోయే అవకాశం ఉంది.
బ్యాంకులో సేవింగ్ అకౌంట్, క్రెడిట్ కార్డు, ఏటీఎం లావాదేవీలు కూడా ఇవి ప్రభావితం చేస్తాయి. మీరు ATM కార్డు ద్వారా డబ్బులు డ్రా చేయాలని ఆలోచిస్తుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం.. బ్యాంకులు ఏటీఎం నుంచి ఉచిత విత్ డ్రా పర్మిషన్ కూడా తగ్గించాయి.
వినియోగదారులు తన బ్యాంకు ఎటిఎం నుండి కేవలం నెలలో మూడు సార్లు మాత్రమే ఉచితంగా డబ్బులు తీసుకునే అనుమతి ఉంటుంది. ఆ తర్వాత డబ్బులు డ్రా చేస్తే ప్రతి లావాదేవీకి 20 రూపాయలు నుండి 25 రూపాయల చార్జి చెల్లించాల్సి ఉంది. అంటే మీరు ఒక నెలలో మూడు సార్ల కంటే ఎక్కువ వేరే బ్యాంకు ATM నుండి డబ్బు తీసుకుంటే ప్రతిసారి మీరు చార్జి చెల్లించాల్సి ఉంటుంది.
మీరు ఏటీఎం ద్వారా నగదు తీసుకున్నట్లయితే ప్రస్తుతం 17 రూపాయల ఛార్జి చెల్లించాలి. అయితే ఏప్రిల్ 1 నుంచి 19 రూపాయలకు పెరగనున్నది. అంతే కాకుండా ఏటీఎం సెంటర్ కు వెళ్లి మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ చెక్ చేసుకునే వారికి ప్రస్తుతం 6 రూపాయలు చార్జి, అయితే ప్రతి లావాదేవికి 7 రూపాయలకు పెరుగుతుంది. ఇది మే నెల 1 నుంచి అమల్లోకి రానున్నది.
డిజిటల్ బ్యాంకింగ్ లో కొత్త ఫీచర్స్ :
డిజిటల్ బ్యాంకింగ్ ప్రోత్సహించడానికి బ్యాంకులు వినియోగదారుల కోసం అనేక ఫీచర్స్ తీసుకొస్తున్నాయి. కస్టమర్లు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా గతంలో కంటే మెరుగైన సేవలు పొందుతున్నారు. దానికోసం బ్యాంకులు కృత్తిమ మేధస్సుతో నడిచే చాట్ బాట్ ప్రవేశ పెట్టబోతున్నారు.
మినిమం బాలెన్స్ :
ఎస్బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంకు మరికొన్ని బ్యాంకులు కనీస బ్యాలెన్స్ కు సంబంధించిన రూల్స్ మార్చబోతున్నాయి. మీ ఖాతా పట్టణ, సేమి అర్బన్ ప్రాంతాలలో ఉందా అనేదానిపై ఆధారపడి ఉంది. బ్యాంకు మినిమం బ్యాలెన్స్ కంటే తక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్నందున మీరు జరిమానాలను కూడా చెల్లించాల్సి వస్తుంది.
MOST READ :
-
Gold Price : ఎవరెస్ట్ ఎక్కిన గోల్డ్ ధర.. తులం ఎంతంటే..!
-
PM Vidya Lakshmi : విద్యార్థులకు ఆర్థిక భరోసా.. పీఎం విద్యాలక్ష్మి.. దరఖాస్తులు ప్రారంభం..!
-
Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!
-
Ration Cards : పేదలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డులు ఎప్పటినుంచంటే.. వారికి కూడా సన్న బియ్యం..!









