జిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి పత్రికలు.. మన సాక్షి క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ..!

ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధి పత్రికలని ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేయడంలో పత్రికల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు.

Narayanpet : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి పత్రికలు.. మన సాక్షి క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధి పత్రికలని ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేయడంలో పత్రికల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్, డి.ఎస్.పి.ఎన్ లింగయ్య లు మనసాక్షి దినపత్రిక 2026 సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమస్యలను వెలికితీస్తూ ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో దినపత్రికల ప్రాధాన్యత ఎంతో ఉందని అన్నారు. ప్రశ్నించే తత్వం సమాజంలో పత్రికలకు తప్ప వేరే వారికి ఎవరికీ ఉండదన్నారు. చట్టానికి లోబడి ఉండి ఫోర్త్ ఎస్టేట్ గా పనిచేసేవి పత్రికలని అన్నారు.

నేటి సమాజంలో పత్రికలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించి కృషి చేసే విధంగా వ్యవహరించాలన్నారు. మనసాక్షి దినపత్రిక ప్రజల ఆధార అభిమానులను పొందుతూ పత్రిక రంగంలో రాణించాలని ఎస్పి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి, జర్నలిస్టులు రాజేష్, నక్క శ్రీనివాస్, శివానంద్, శంకర్, సురేందర్, రఘు తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. ACB : ఇంటి పర్మిషన్ కోసం లంచం.. ఏసీబీ అధికారులకు చిక్కిన అధికారి..!

  2. Miryalaguda : మిర్యాలగూడలో అధికార కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఆగని వలసలు.. బీ ఆర్ ఎస్ లో భారీగా చేరికలు..!

  3. BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు బీబీఏ విద్యార్థులు మృతి..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఇక వారి కష్టాలు తీరినట్టే..!

మరిన్ని వార్తలు