వినాయక నిమజ్జనంలో అపశృతి.. యువకుడి మృతి..!

వినాయకుడి నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. చెరువులో పడి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో దత్తాయిపల్లి లో చోటుచేసుకుంది.

వినాయక నిమజ్జనంలో అపశృతి.. యువకుడి మృతి..!

హైదరాబాద్, మన సాక్షి :

వినాయకుడి నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. చెరువులో పడి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో దత్తాయిపల్లి లో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక నిమజ్జనం లో స్నేహితులతో కలిసి ఉల్లాసంగా నిమజ్జనం చేస్తుంటే చెరువులో పడి యువకుడు మృతి చెందాడు.

దత్తాయపల్లి గ్రామానికి చెందిన బుర్ర రమేష్( 21) నిమజ్జనం లో భాగంగా చెరువులోకి వెళ్ళాడు. చెరువు లోతులో ఉండటంతో చెరువులో మునిగిపోయాడు. కేశంపేట పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.