తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : నామినేషన్లు వేసే వారికి హెల్ప్ డెస్క్ ద్వారా సహకరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

Miryalaguda : నామినేషన్లు వేసే వారికి హెల్ప్ డెస్క్ ద్వారా సహకరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

దామరచర్ల , మన సాక్షి :

గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండవ విడత ఎన్నికలు నిర్వహించనున్న మిర్యాలగూడ డివిజన్లోని పలు నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తనిఖీ చేశారు. దామరచర్ల మండల కేంద్రంలోని దామరచర్ల గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ నామినేషన్ వేసేందుకు చేసిన ఏర్పాట్లను, హెల్ప్ డెస్క్ ను, ఎన్నికల నోటిఫికేషన్ ప్రచురించింది లేనిది పరిశీలించారు.

అలాగే గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలను ఎంపీడీవో ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆ క్లస్టర్ లో ఇప్పటి వరకు వచ్చిన నామినేషన్ల వివరాలను, నామినేషన్ పత్రాలు, నామినేషన్ వేసేందుకు వచ్చే వారికి హెల్ప్ డెస్క్ ద్వారా అందిస్తున్న సమాచారం, నామినేషన్ వేసేటప్పుడు సమర్పించాల్సిన ధ్రువపత్రాలు, ఇతర అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్, తదితర అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

వచ్చిన నామినేషన్లనింటిని ఎప్పటికప్పుడు స్కాన్ చేయడం, రిజిస్టర్లో నమోదు చేయడం, నామినేషన్ వివరాలను సకాలంలో డి పి ఓ జర్యాలయనికి పంపించడం, టి పోల్ లో అప్లోడ్ చేయడం లాంటివి జాప్యం లేకుండా చేయాలని ఈ సందర్భంగా ఆమె ఇబ్బందిని ఆదేశించారు.

నామినేషన్ స్వీకరించే గదిలో డిజిటల్ క్లాక్, 100 మీటర్ల పరిధిలో బందోబస్తు, ఓటరు జాబితా ప్రచురణ తదితర అంశాలను కూడా ఆమె పరిశీలించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, దామరచర్ల మండలం ఎంపీడీవో, ఎంపీఓ, ఆర్ ఓ,తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Nalgonda : రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ.. డైరెక్టర్ ఇంటిముందు బాధితుల ఆందోళన..!

  2. Murder : గిరిజన మహిళను హత్య చేసి బావిలో పడేసిన ఉదంతం.. నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి..!

  3. IBOMMA : ఐ బొమ్మ పేరు ఎందుకు పెట్టాడో చెప్పిన రవి.. ముగిసిన కస్టడీ..!

  4. Ayyappa Devotees : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరి కి వెళ్తున్న వారికి వెసులుబాటు..!

  5. Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు