Miryalaguda : ఎన్ వి ఆర్ క్రికెట్ కప్ పోటీలు ప్రారంభం..!
Miryalaguda : ఎన్ వి ఆర్ క్రికెట్ కప్ పోటీలు ప్రారంభం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఎన్ వి ఆర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలో ఎన్ వి ఆర్ క్రికెట్ కప్ నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది.
టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు, క్రీడా అభిమానులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులలో ఉన్నటువంటి నైపుణ్య పెరుగుదలలో క్రీడలు దోహదపడుతాయని, మిర్యాలగూడ నియోజకవర్గం నుండి రాష్ట్రస్థాయిలో , జాతీయస్థాయిలో క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు.
ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహణకు మూలం ఐన ఎన్ వి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నూకల వేణుగోపాల్ రెడ్డి ని, ఈ యొక్కటోర్నమెంట్ నిర్వహించిన ఫౌండేషన్ ముఖ్య సభ్యులు అశోక్ నాయక్ ని అభినందించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు బి ఎల్ ఆర్ టోర్నమెంట్
టీషర్ట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో ఎన్ వీ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నూకల వేణుగోపాల్ రెడ్డి , ఫౌండేషన్ ముఖ్య సభ్యులు అడొత్ అశోక్ నాయక్, 5వార్డు కౌన్సిలర్ నర్సిరెడ్డి, 17వార్డు కౌన్సిలర్ రవి నాయక్ , 4వార్డు కౌన్సిలర్ వెంకన్న, మాజీ ఎంపిటీసి బెజ్జం సాయి, పివి శ్రీధర్ గౌడ్, ఆర్గనైజింగ్ సభ్యులు ధనావత్ నాగునాయక్, గడగోజు అశోక్ చారి, గుడిపాటి కృష్ణ,దాసరి బీమేశ్, అనిల్ కుమార్, మనాని, శ్రీధర్, లక్ష్మణ్, నాని తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
TG News : అందరి ముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. వైరల్ అవుతున్న వీడియోలు..!
-
Nalgonda : తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలండర్ ఆవిష్కరణ..!
-
Rythu Bharosa : రైతు భరోసా అర్హతకు రూల్స్ విడుదల.. మీరు అర్హులేనా.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : 26 నుంచి 4 పథకాలు ప్రారంభం.. మీరు అర్హులేనా..!
-
Rythu Bharosa : వారికి రైతు భరోసా ఇవ్వొద్దు.. సీఎం రేవంత్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు..!









