Suryapet : ఆయిల్ పామ్ రైతుల పంట పండుతోంది.. ప్రభుత్వం భారీగా ప్రోత్సాహం..!

Suryapet : ఆయిల్ పామ్ రైతుల పంట పండుతోంది.. ప్రభుత్వం భారీగా ప్రోత్సాహం..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లాలో నాలుగేండ్ల క్రితం సాగు చేసిన ఆయిల్ పామ్ పంట చేతికి వస్తుండడం.. మరో వైపు గెలల ధర భారీగా పెరగడంతో రైతుల్లో నూతన ఉత్సాహం నెలకొంటోంది. ఇన్నాళ్లు ఎప్పుడో వచ్చే పంట కోసం ఇప్పుడేం కష్టపడి సాగు చేయాలను కున్న రైతులు కూడా..ఇప్పుడు ఆయిల్ పామ్ ను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో జిల్లాలో సాగు పెరుగుతున్నది. జిల్లాలో ప్రస్తుతం 4885 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు ఉంది. ఆయిల్ పామ్ పథకంలో పెట్టిన టార్గెట్ లో ఇప్పటి వరకు 450 ఎకరాలు ఎకరాల్లో తాజాగా పంట చేతికి వస్తుండడంతో పంటను చూసిన ఇతర రైతులు ఆయిల్ పామ్ సాగుకు ఆకర్షితులవుతున్నారు.
ఏటా పెరుగుతున్న సాగు
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిం చేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. దిగుబడి వచ్చేంత వరకు అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చు. వరి, పత్తి పంటలతో పోల్చితే రైతులు తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో మంచి లాభాలు సాధించే అవకాశం ఉంది. దీంతో
గత నాలుగేండ్లుగా జిల్లాలో ఆయిల్ పామ్ గణ నీయంగా పెరుగుతోంది.
ఒక్కసారి నాటితే 30 ఏండ్ల దాకా దిగుబడి
ఆయిల్ పామ్ మొక్కలను ఒకసారి నాటితే 30 ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. నాటిన నాలుగో యేడు నుంచి పంట చేతికి వస్తుంది. మొదటి నాలుగేండ్ల వరకు ప్రభుత్వమే నిర్వహణ ఖర్చులు భరిస్తున్నది. మొదటి మూడేండ్లు మొక్కజొన్న, పత్తి, వేరుశనగ లాంటి పంటలను అంతర పంటగా సాగు వేసుకోవ చ్చు. నాలుగోయేడు నుంచి పంట దిగుబడి వస్తుంది. ఎకరాకు కనీసం 10 టన్నులకు తక్కువ కాకుండా దిగుబడి వస్తుంది. చెట్టు పెరిగే కొద్దీ మెలకువలు పాటిస్తూ 15 నుంచి 20టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇటీవల సూర్యాపేట జిల్లాలో మొదటి కాతలోనే 10 టన్నుల దిగుబడి రావడం గమనార్హం.
ఆయిల్ పామ్ కు ప్రోత్సాహం
వరి, ఇతర సంప్రదాయ పంటలకు
ప్రత్యామ్నాయంగా రైతులకు లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. నూనె వినియోగానికి తగినట్టు పంట లేకపోవడంతో ఏటా దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఫలితంగా ఆదాయం కోల్పోవడంతో పాటు అధిక ధరలకు నూనెలను కొనుగోలు చేయాల్సి వస్తున్నది. దీనిని నివారించేందుకు ప్రభుత్వం ఆయిల్పామ్ సాగుకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నది.
రాష్ట్రంలో గత 2020-21 నుంచి ఆయిల్ పామ్ మిషన్ కొనసాగుతోంది. రైతులకు రాయితీలు ఇచ్చి సాగును ప్రోత్సహిస్తున్నారు. ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు మొదటి నాలుగేండ్లలో అంతర పంటల సాగుకు, కలుపు తీయడానికి, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ఎకరానికి రూ.4,200 ఆర్థిక సాయం అందిస్తోంది. మార్కెట్ లో రూ.193 నుంచి రూ.200 ఉండే ఆయిల్ పామ్ మొక్కలను సబ్సిడీతో రూ.20కే రైతులకు అందిస్తోంది. డ్రిప్ సౌకర్యం కల్పించేందుకు యూనిట్ ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీగా అందిస్తోంది.
ఆయిల్ పామ్ సాగుపై రైతుల్లో ఆసక్తి
గతంలో వేసిన ఆయిల్ పామ్ పంట నేడు చేతికి వస్తుం డడం.. మరో వైపు గెలల భారీగా ధర పలుకుతుండ డంతో రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వస్తున్నరని జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య అన్నారు.. రైతుల అనుమానాలు నివృత్తి అవుతుండడంతో సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోంది. పండించిన గెలలను మండలం లోని కలెక్షన్ పాయింట్ లను ఏర్పాటు చేసి రైతుల నుండి నేరుగా కొనుగోలు చేస్తుంది. దింతో ఆయిల్ పామ్ పండించే రైతులు పంట అమ్ముకోవడం చాల సులభంగా ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
MOST READ NEWS :
-
Rythu Bharosa : టింగ్..టింగ్..టింగ్.. మోగుతున్న పోన్లు.. వారికి బ్యాంకు ఖాతాలలో రైతు భరోసా డబ్బులు..!
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు పడ్డాయి.. చెక్ చేసుకోండి.. లేటెస్ట్ అప్డేట్..!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఆసుపత్రుల పర్యవేక్షణకు త్వరలో యాప్..!
-
Alumni : 34 సంవత్సరాల తర్వాత అందరు ఒకేచోట..!
-
KTR : మళ్లీ చెప్తున్నా.. ఇది లొట్టపీసు కేసే.. కేటీఆర్..!











