Banana : ఒక్క అరటిపండు రూ.100.. ఎక్కడో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..!
Banana : ఒక్క అరటిపండు రూ.100.. ఎక్కడో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ఒక్క అరటిపండు ధర 100 రూపాయలు.. అవును మీరు విన్నది కరెక్టే. ఇది ఎక్కడో కాదు.. తెలిస్తే.. మీరూ షాక్ కావాల్సిందే. హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటనతో రష్యన్ యువకుడు షాక్ అయ్యాడు. అతడికి మైండ్ బ్లాక్ అయింది.
రష్యన్ యువకుడు హగ్ భారత పర్యటనలో భాగంగా ఇటీవల హైదరాబాదులో అడుగు పెట్టాడు. రోడ్డుపై వెళ్తున్న తోపుడు బండి వద్ద అరటిపండు ధర ఎంత అని అడిగాడు. అయితే ఆ వ్యాపారి వంద రూపాయలు అని చెప్పాడు. దాంతో ఆశ్చర్యపోయిన రష్యన్ యువకుడు హగ్ మరోసారి ఒక్క అరటిపండు ధర అడుగుతున్నాను అంటూ మళ్ళీ అడిగాడు. అయితే ఆ వ్యాపారి మరోసారి కూడా వంద రూపాయలు అంటూ చెప్పాడు.
అతడికి ఒక్క అరటిపండు ధర 100 రూపాయలు అంటూ హిందీ, ఇంగ్లీషులో చెప్పాడు. అయితే ఆ రష్యాన్ యువకుడు బాబోయ్ అంత ధర.. నేను కొనలేను అంటూ.. యూకే లో అయితే 8 అరటి పండ్లు వస్తాయి అని అన్నాడు. ఇది ఈ వీడియోను హాగ్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వింత అనుభవం రష్యన్ యువకుడికి హైదరాబాద్ లోనే ఎదురు కావడం విశేషం.
MOST READ :
-
Gold Price : బంగారం ధర ఎంతో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)
-
TG News : మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి రూ.12 వేలు..!
-
Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!
-
Jobs : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో కొలువుల జాతర..!









