Accident : రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు..!
Accident : రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు..!
కనగల్, మన సాక్షి :
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కనగల్ ఎస్సై పి. విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం…
గుర్రంపోడు మండలం పల్లిపహాడ్ కు చెందిన మామిడి సైదులు, మాతంగి ప్రసాద్, ఎల్లయ్యలు కనగల్ మండల పరిధిలోని ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఫంక్షన్ హాల్ లో జరిగిన బంధువుల పెళ్ళికి హాజరై బైక్ పై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు.
కనగల్ శివారుకు చేరుకోగానే మామిడి సైదులు అతివేగంగా బైకు నడపడంతో అదుపుతప్పి రోడ్డుకు కుడి ప్రక్కన ఉన్న చెట్టుకు బైకు ఢీకొట్టింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న సైదులుకు, బైకుపై మధ్యలో కూర్చున్న ఎల్లయ్యకు, వెనక కూర్చున్న ప్రసాద్ కు తీవ్ర గాయాలయ్యాయి.
చికిత్స నిమిత్తం బాధితులను 108లో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మామిడి ఎల్లయ్య (54) శుక్రవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
LATEST UPDATE :
BIG BREAKING : నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే మహిళ ప్రసవం..!
మిర్యాలగూడ : పిడిఎస్ బియ్యం రీసైక్లింగ్.. ట్రేడింగ్ లైసెన్సులతో భారీ మోసం..!
Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!
Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!









