KTR : లక్ష యాభై వేల కోట్లు.. 15 పక్కన ఇన్ని సున్నాలా.. ఏమిటి ఆ కథ, కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!
KTR : లక్ష యాభై వేల కోట్లు.. 15 పక్కన ఇన్ని సున్నాలా.. ఏమిటి ఆ కథ, కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
మూసి సుందరీకరణకు మొన్న 50 వేల కోట్లు అన్నారు. నిన్న 70 వేల కోట్లు వెచ్చిస్తామన్నారు. నేడు లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు… అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
తెలంగాణ రైతుల తలరాతలు మార్చిన కాలేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్ల రూపాయలు అయితే గల్లి నుంచి ఢిల్లీ దాకా గగోలు పెట్టింది కాంగ్రెస్. మరి మూసీ సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్లు.. 15 పక్కన ఇన్ని సున్నాలా.. 15,000,000,000,000 అంటూ ట్వీట్ చేశారు.
మూసీ నదిని లండన్ లోని థేమ్స్ లాగా మారుస్తామనే వెనుక ధీమ్ ఏంటి..? గేమ్ ప్లాన్ ఏంటి ముఖ్యమంత్రి గారు. మూడింతలు పెంచిన మూసి అంచనా వేయం కాంగ్రెస్ దన దాహానికి సజీవ సాక్ష్యం అంటూ.. ఆయన ముఖ్యమంత్రి ని విమర్శించారు.
మూసి ప్రాజెక్టుతో మురిసే రైతులెందరూ, నిల్వ చేసే టీఎంసీలు ఎన్ని..? సాగులోకి వచ్చే ఎకరాలు ఎన్ని..? పెరిగే పంటల దిగుబడి ఎంత..? తీర్చే పారిశ్రామిక అవసరాలు ఎంత..? కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లు ఎన్ని..?
పుట్టిన గడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రికి పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా మూసి ప్రాజెక్టు పైనే ఎందుకింత మక్కువ..? అని పేర్కొన్నారు.
మూసి ప్రాజెక్టుకు చేపట్టాల్సిందే సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సిందే కానీ మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే పని షురూ చేస్తే సహించేది లేదని పేర్కొన్నారు.
మూసి రివర్ ఫ్రంట్ పేరిట బ్యాక్ డోర్ లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోంది. కుంభకోణాల కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాతపెడుతుంది అంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
Runamafi : రుణమాఫీ పై కీలక అప్డేట్.. రెండవ విడత మాఫి ఎప్పుడంటే..!
Bogatha Waterfall : తెలంగాణలో కనువిందు చేస్తున్న బోగత జలపాతం.. పర్యాటకుల తాకిడి..!









