Cyber crime : ఆన్‌లైన్ మోసం.. రూ.2.80 లక్షలు పోగొట్టుకున్న గృహిణి..!

Cyber crime : ఆన్‌లైన్ మోసం.. రూ.2.80 లక్షలు పోగొట్టుకున్న గృహిణి..!
దమ్మపేట, మనసాక్షి:
దమ్మపేట మండలం లచాపురం గ్రామానికి చెందిన కంపాటి చిలకమ్మ ( గృహిణి) ఆన్‌లైన్ మోసానికి బలయ్యారు. ఆగస్టు 16వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో చిలకమ్మ ఫోన్‌కు టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ ద్వారా ఎన్ఎస్ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ” పేరిట ఒక లింక్ వచ్చింది.
ఆ లింక్ ద్వారా డబ్బు పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మబలికారు. లాభాలు వస్తాయని నమ్మి చిలకమ్మ మొత్తం రూ. 2,80,000/-ను క్రమంగా పంపించారు. కానీ ఎలాంటి లాభాలు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సెప్టెంబర్ 10న ఆన్‌లైన్‌లో ఎన్సీఆర్పీ (నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ) లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఏసీకె : 33708250037904 క్రింద నమోదు అయ్యింది. ఎన్సీఆర్పీ టీమ్ స్పందించి మోసగాళ్ల ఖాతాల్లోని రూ. 80,264/- మొత్తాన్ని ఫ్రీజ్ చేసింది. అనంతరం చిలకమ్మ స్వయంగా దమ్మపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీని మేరకు క్రైమ్ నంబర్ 225/2025, సెక్షన్ 318(4) బిఎన్ఎస్ , సెక్షన్ 66(D) ఐ టీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.
MOST READ :
-
Penpahad : యూరియా కోసం రైతుల రాస్తారోకో..!
-
కల్వకుర్తిలో ఘరానా మోసం.. బైకులో ఉన్న డబ్బు స్వాహా..!
-
CM Revanth Reddy : కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఆ భూములు బదిలీ చేయాలని వినతి..!
-
Additional Collector : సూర్యాపేట జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ గా సీతారామారావు.. ఎవరో తెలుసా..!
-
District collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!









