Doctorate : ఉస్మానియా డాక్టరేట్ అందుకున్న యువ కవి..!

Doctorate : ఉస్మానియా డాక్టరేట్ అందుకున్న యువ కవి..!
మేడ్చల్ మల్కాజిగిరి, మనసాక్షి :
ఓ యు డాక్టరేట్ అందుకొన్న యువ కవి తులసి రమణా చార్యులు. ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్న యువ కవి, రచయిత, అక్షర కౌముదిన్ సంస్థ అధ్యక్షులు తులసి వెంకట రమణా చార్యులకి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓరియంటల్ విభాగం నుంచి డాక్టరేట్ అందుకున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓరియంటల్ విభాగం నుంచి తులసి వెంకట రమణా చార్యులు పి హెచ్ డి పరిశోధన పూర్తి చేసి ఓ యు డాక్టరేట్ అందుకొన్నారు. వీరి పరిశోధన అంశం మసన చెన్నప్ప రచనలు పరిశీలన పై డా చంద్రశేఖర్ రావు పర్యవేక్షణలో పరిశోధన చేసి మసన చెన్నప్ప రచనలు పరిశీలన అనే సిద్ధాంత గ్రంథం ను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించారు.
విశ్వవిద్యాలయం అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి తులసి వెంకట రమణా చార్యులు పేరును పత్రిక ప్రకటన ద్వారా ఓ యు విభాగం వారు వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టరేట్ పొందిన తులసి వెంకట రమణా చార్యులు మాట్లాడుతూ నా పరిశోధనకు స్పూర్తి దాతలుగా నిలిచిన పరిశోధన పూర్తి కావడానికి మూలకారణమైన డీన్ డాక్టర్ రాజారత్నం కి, ప్రాచ్య భాషల విభాగం తెలుగుశాఖ పాఠ్యప్రాణాలిక సంఘం అధ్యక్షులు డాక్టర్ బి ప్రేమ్ కుమార్, పూర్వ డీన్ డాక్టర్ ఎ సిల్మానాయక్, డాక్టర్ చవ్వా వెంకట రెడ్డి, డాక్టర్ పి జగన్నాథ రావు లకి పి హెచ్ డి లో నా ప్రవేశం నుంచి నేటివరకు మార్గదర్శిగా నిలిచిన డాక్టర్ కె చంద్రశేఖర రావుకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఒక సామాన్యమైన శ్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టి, పెరిగి, తల్లిదండ్రుల ఆశీస్సులు, ఆచార్యులు, గురువుల ఆశీర్వాదం వల్లనే ఈ స్థాయికి చేరుకొన్నాననిఅన్నారు. పూర్వం నల్గొండ జిల్లా ప్రస్తుతం సూర్యాపేట జిల్లా మునగాల మండలం గుంపుల మాధవరం లో జన్మించి ఉన్నత విద్యకోసం నగరం చేరుకొని మల్కాజ్ గిరి లో స్థిరపడ్డాను.
నా సోదరుల, మిత్రుల సహాయ సహకారాలతో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించి ఒక ఉన్నత స్థాయి కి చేరుకోవడానికి కారకులైన నా కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ నా హృదయ పూర్వక వినమ్ర నమస్సులు తెలుపుతున్నాను అని అన్నారు.
MOST READ :
-
Devarakonda : ఈ దొంగ మామూలోడు కాదు.. మూడు రాష్ట్రాల్లో 100కు పైగా దొంగతనాలు..!
-
Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!
-
Nalgonda : దళిత మైనర్ బాలికపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి.. పోక్సో కేసు నమోదు..!
-
Nalgonda : 15న నల్లగొండకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాక.. ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!
-
TG News : నడి రోడ్డుపై ఏంటివి ఇవి.. ఇలా ఎందుకు పెట్టారు.. అయినా వాళ్లు ఇటువైపు చూడరు..!
-
Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!









