Breaking Newsతెలంగాణవిద్యహైదరాబాద్

Doctorate : మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో సతీష్ కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్..!

ఉస్మానియా యూనివర్సిటీ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో కొత్త సతీష్ డాక్టరేట్ సాధించారు.

Doctorate : మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో సతీష్ కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్..!

మన సాక్షి, హైదరాబాద్ :

ఉస్మానియా యూనివర్సిటీ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో కొత్త సతీష్ డాక్టరేట్ సాధించారు. సీనియర్ ప్రొఫెసర్ పప్పుల లక్ష్మీనారాయణ, సీనియర్ ప్రొఫెసర్ కె. శ్యామల పర్యవేక్షణలో ”ఆప్టిమైజేషన్ ఆఫ్ పారామీటర్స్ అండ్ రియల్ టైమ్ టెంపరేచర్ కంట్రోల్ ఆఫ్ 3డి ప్రింటెడ్ AlSi10Mg అలయ్ స్పెసిమెన్స్ యూజింగ్ అర్డూనో సెన్సార్ ఇంటిగ్రేషన్” అనే అంశంపై పరిశోధన పూర్తిచేశారు.

సతీష్ సమర్పించిన పరిశోధన గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు ఆయనకు పీహెచ్‌డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త సతీష్ షాద్నగర్ పట్టణంలో, రంగరెడ్డి జిల్లా లో వ్యాపార వేత్త కొత్త రమేష్, కొత్త సంధ్య రాణి దంపతుల మొదటి కుమారుడు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు.

MOST READ 

మరిన్ని వార్తలు